శక్తిమంతమైన మిగ్-27 యుద్ధవిమాన శ్రేణికి భారత వాయుసేన నేడు వీడ్కోలు పలికింది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన ఈ లోహ విహంగాలు ఇక చరిత్రగా మిగిలిపోనున్నాయి.
ఈ రోజు రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ వైమానిక స్థావరం నుంచి మిగ్-27 విమానాలు చివరిసారిగా గగనవిహారం చేశాయి. ఈ వీడ్కోలుతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడింది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు.
భారత వైమానిక దళంలో దీన్ని 'బహుద్దూర్'గా వ్యవహరిస్తారు.
ఇదీ చూడండి: రివ్యూ 2019 : నింగిలో నిరాటంకంగా దూసుకెళ్లిన 'ఇస్రో'