ETV Bharat / bharat

మిడతలను తరిమికొట్టేందుకు బరిలోకి ఎయిర్​ఫోర్స్ - మిడతల నివారణ

విమానయాన సాంకేతికత విషయంలో భారత వాయుసేన స్వయం సమృద్ధి సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో మిడతల నివారణ కోసం సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించింది. వాయుసేనకు చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లకు మార్పులు చేసి పురుగుల మందులు చల్లే విధంగా తయారు చేసింది.

Indigenous Airborne Locust Control System on MI-17 Helicopter
ఎంఐ-17 విమానాలతో మిడతల నివారణ
author img

By

Published : Jul 1, 2020, 11:37 AM IST

మిడతల ప్రమాదాన్ని గుర్తించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే నెలలోనే అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా.. పురుగుల మందులు చల్లేందుకు వీలుగా భారత వాయుసేనకు చెందిన రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లకు మార్పులు చేయాలని బ్రిటన్​కు చెందిన ఎం/ఎస్ మైక్రాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కరోనా కారణంగా ఆ సంస్థ.. ఇందుకు అవసరమైన కిట్లను సరైన సమయంలో తయారు చేయలేకపోయింది. సెప్టెంబర్ తర్వాతే వీటిని భారత వాయుసేనకు అందించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మే నెలలో అనేక రాష్ట్రాల్లో మిడతలు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి.

దేశీయంగా చేస్తే సరి!

దీంతో హెలికాప్టర్లకు దేశీయంగానే మార్పులు చేసుకోవాలని భారత వాయుసేన నిర్ణయించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్​బోర్న్ లోకస్ట్ కంట్రోల్ సిస్టమ్(ఏఎల్​సీఎస్)ను రూపొందించే పనిని చండీగఢ్​లోని బేస్ రిపేర్ డిపో నెం.3కి అప్పగించింది. దీనిని ఎంఐ-17 హెలికాఫ్టర్లలో అమర్చే బాధ్యత కట్టబెట్టింది.

ఎంఐ-17 హెలికాఫ్టర్​కు రెండు వైపులా గొట్టాల(నాజిల్స్)ను అమర్చారు. వాణిజ్యపరంగా లభించే నాజిల్స్​తో పాటు చండీగఢ్ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్​స్ట్రూమెంట్ ఆర్గనైజేషన్(సీఎస్​ఐఓ) రూపొందించిన నాజిల్స్ కలయికతో వీటిని రూపొందించారు. స్వదేశీ పరికరాలతో తయారు చేసిన ఈ వ్యవస్థ ద్వారా విజయవంతంగా పురుగుల మందులను గాల్లోకి వెదజల్లారు.

స్వదేశీ పరిజ్ఞానంతో మిడతల నివారణ వ్యవస్థ

ఇదీ ప్రక్రియ..

మలాథియాన్ అనే​ పురుగులమందును హెలికాప్టర్​లోని 800 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిలియరీ ట్యాంకుల్లో నింపుతారు. ఈ క్రిమిసంహారకాన్ని హెలికాప్టర్​​కు అమర్చిన గొట్టాల ద్వారా విద్యుత్ పంప్​ను ఉపయోగించి వెదజల్లుతారు. దీని ద్వారా 40 నిమిషాల్లో దాదాపు 750 హెక్టార్ల విస్తీర్ణంలో పురుగుల మందులను చల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బెంగళూరుకు చెందిన శిక్షణ పైలట్లు, ఇంజినీర్లు కలిసి ఈ ట్రయల్స్​ని విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. మిడతల నియంత్రణ కోసం చేపట్టే ఆపరేషన్లకు ఈ వ్యవస్థను అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ లాభాలు..

ఏఎల్​సీఎస్​ను దేశీయంగా అభివృద్ధి చేసినందున ఎప్పుడైనా ఈ వ్యవస్థను అప్​గ్రేడ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నిర్వహణ సైతం సులభంగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా.. విమానయాన సాంకేతికత రంగంలో స్వయం సమృద్ధి సాధించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి- కరోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.