ETV Bharat / bharat

చైనాతో సరిహద్దుల వద్ద దూకుడుగానే సైన్యం!

సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో దూకుడుగానే వ్యవహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. దిల్లీలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో సరిహద్దుల వద్ద తాజా పరిస్థితులపై చర్చించిన ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

lac issue- acc
చైనాతో సరిహద్దుల వద్ద దూకుడుగానే సైన్యం
author img

By

Published : May 30, 2020, 8:52 AM IST

తూర్పు లద్ధాఖ్​లో చైనా సరిహద్దుల వద్ద దూకుడుగానే ఉండాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల వద్ద చైనా ప్రభుత్వం బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

దిల్లీలో 3 రోజుల పాటు జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ భేటీలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పాటు పలు సున్నిత అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశం అనంతరం సైన్యం ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేసినా, అందులో ఏ అంశాలపై చర్చ జరిగిందీ వెల్లడించలేదు.

ఆ ప్రాంతాల్లో దూకుడుగానే..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తూర్పు లద్ధాఖ్​తో పాటు, జమ్ము కశ్మీర్​లోని తాజా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు తెలిసింది. సరిహద్దులోని పాంగాంగ్​ సో సరస్సు, గాల్వన్ లోయ, డెమ్​చోక్​, దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద దూకుడుగానే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి మునుపటి పరిస్థితి కొనసాగేలా చూడాలని నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.