ETV Bharat / bharat

'అందరికీ టీకా అందించే సత్తా భారత్​కు ఉంది' - క్లినికల్​ ట్రయల్స్

ఇతర దేశాలకూ కొవిడ్​ టీకా అందించే సామర్థ్యం.. భారత్​కు ఉందని తెలిపింది విదేశీ వ్యవహారాల శాఖ. ఇందుకోసం తగినంతగా.. దేశంలో టీకా ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించింది.

India's vaccine production, delivery capacity to help all humanity in fighting COVID-19: MEA
'అందరికీ టీకా అందించే సత్తా భారత్​కు ఉంది'
author img

By

Published : Oct 30, 2020, 6:46 AM IST

కొవిడ్​తో పోరాడుతున్న వారందరికీ టీకా అందించే సరఫరా సామర్థ్యం.. భారత్​కు ఉందని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఇతర దేశాలకు సహకరించేలా దేశంలో వ్యాక్సిన్​ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించింది.

పొరుగు దేశాల టీకా అవసరాల కోసం రెండు శిక్షణా కేంద్రాలను నెలకొల్పామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీ వాస్తవ తెలిపారు. ఇందులో 90 మంది ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

"కొవిడ్​తో పోరాడుతున్న వారందరికీ సరఫరా చేసేలా భారత్​లో వ్యాక్సిన్​ ఉత్పత్తి జరుగుతోంది. గత నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రధాని మోదీ ఇదే విషయాన్ని ప్రకటించారు. వ్యాక్సిన్​ అభివృద్ధి జరుగుతుండగానే మరో వైపు అన్ని దేశాలకు సహకారం అందేంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అందరికీ టీకా అందుబాటులోకి తెచ్చేలా ఇతర దేశాల్లోనూ క్లినికల్​ ట్రయల్స్​ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం."

-- అనురాగ్​ శ్రీ వాస్తవ, విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.

అక్టోబర్​ 17న బంగ్లాదేశ్​లో అధికారులు పర్యటించారని అనురాగ్​ చెప్పారు. అక్కడ క్లినికల్​ ట్రయల్స్​ జరిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మయన్మార్​తోనూ వర్చువల్​గా సంప్రదింపులు జరిపామని వెల్లడించారు.

ఇదీ చూడండి:దేశంలో 10.65 కోట్లు దాటిన కరోనా టెస్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.