ETV Bharat / bharat

అక్టోబర్​ 27న భారత్, అమెరికా '2+2' చర్చలు - భారత్ అమెరికా చర్చలు

చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దిల్లీలో భారత్, అమెరికా మూడో దఫా 2+2 చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య అక్టోబర్​ 27న జరిగే ఈ భేటీలో నిఘా, సైనిక, అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు.

INDOUS
రక్షణ
author img

By

Published : Oct 22, 2020, 5:10 AM IST

భారత్, అమెరికా మూడో దఫా 2+2 చర్చలు దిల్లీలో అక్టోబర్ 27న జరగనున్నట్లు విదేశాంగా శాఖ (ఎంఈఏ) తెలిపింది. రక్షణ, భద్రత, అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉంది.

చర్చల్లో పాల్గొనడానికి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్.. అక్టోబర్ 26న భారత్​కు రానున్నట్లు ఎంఈఏ తెలిపింది. భారత ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.

నిఘా, సైనిక రంగాల్లో..

ఈ సదస్సులో నిఘా, సైనిక వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని విస్తరణకు మార్గం సుగమం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న బేసిక్ ఎక్స్చేంజి అండ్ కోఆపరేషన్​ అగ్రిమెంట్ (బీఈసీఏ)ను ఖరారు చేసే అవకాశం ఉంది. బీఈసీఏ ద్వారా ఇరు దేశాల మధ్య అత్యంత అధునాతన సైనిక సాంకేతికత, రవాణా, భౌగోళిక మ్యాపుల మార్పిడి సాధ్యమవుతుంది.

చైనా దూకుడుపై..

తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతలతోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు పెంచిన నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు అంశాలపై భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లద్దాఖ్​లో చైనా వైఖరిని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది.

విస్తృత చర్చలు...

భారత్​తో చర్చలకోసం ఎదురుచూస్తున్నట్లు పాంపియో వెల్లడించారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతామని తెలిపారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా దేశాలన్ని కలిసి పనిచేయాలని అన్నారు. భారత్​తో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేసియాలో పర్యటించనున్నారు పాంపియో.

భారత్- అమెరికా మొదటి దఫా 2+2 చర్చలు 2018లో దిల్లీలో జరిగాయి. గతేడాది డిసెంబర్​లో రెండో దఫా చర్చలు వాషింగ్టన్​లో నిర్వహించారు.

ఇదీ చూడండి: దక్షిణ కొరియా ప్రధానితో మోదీ సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.