ETV Bharat / bharat

'తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్​తో స్నేహగీతం' - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020

భారత్​, అమెరికా తమ ప్రజలను ఇస్లామిక్​ తీవ్రవాదం నుంచి రక్షించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని ఉద్ఘాటించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. ఇరు దేశాల మధ్య రక్షణ బంధాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టంచేశారు. అద్భుత వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​లో 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమంలో డొనాల్డ్​​ ప్రసంగించారు.

India, US committed to defence people from radical islamic terrorism: President Trump
'తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్​తో స్నేహబంధం'
author img

By

Published : Feb 24, 2020, 5:38 PM IST

Updated : Mar 2, 2020, 10:25 AM IST

'తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్​తో స్నేహగీతం'

భారతదేశాన్ని అమెరికా ఎంతగానో ప్రేమిస్తుందని, గౌరవిస్తుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​ మోటేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమంలో జనసంద్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

భారత సంస్కృతి, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవాలు, చట్టాలు, సర్వమత సమానత్వాన్ని ట్రంప్​ కొనియాడారు. ఇరుదేశాల రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్​ తీవ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని ఉద్ఘాటించారు ట్రంప్.

"ఉగ్రవాదులను అడ్డుకుని, వారి సిద్ధాంతాలపై పోరాడటానికి అమెరికా-భారత్​ కట్టుబడి ఉన్నాయి. ఇదే విషయమై.. నేను అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి మా అధికార యంత్రాంగం పాకిస్థాన్​తో చర్చలు జరుపుతోంది. పాక్​తో కలిసి ఉగ్రవాద సంస్థలను అరికట్టి, ఆ దేశ సరిహద్దు కేంద్రంగా పనిచేసే ఉగ్రమూకలను తరిమికొట్టే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. ఈ చర్యల వల్ల పాకిస్థాన్​లో సానుకూల స్పందనలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. ఈ విషయంలో భారత్ నాయకత్వ​ పాత్ర ఎంతో అవసరం."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

రక్షణ రంగంపై...

ఇరుదేశాల మధ్య జరగబోయే రక్షణ ఒప్పందాలను ట్రంప్​ ప్రస్తావించారు. భారత్​-అమెరికా మధ్య 3 బిలియన్​ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. భారత్​కు అమెరికా అతిపెద్ద రక్షణ భాగస్వామిగా నిలుస్తుందన్నారు.

"మన మధ్య ఉన్న రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. ప్రపంచంలోనే అత్యాధునిక మిలిటరీ సామగ్రిని భారత్​కు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము గొప్ప ఆయుధాలు తయారు చేస్తున్నాం. అందులో విమానాలు, క్షిపణులు, రాకెట్లు, నౌకలు ఉన్నాయి. ఇప్పుడు భారత్​తో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ఒప్పందంలో అత్యాధునిక ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్స్​, ఆయుధాలు కలిగిన, సాధారణ విహంగాలు ఉన్నాయి. భారత రక్షణ విభాగానికి సుమారు 3 బిలియన్​ డాలర్ల విలువైన హెలికాఫ్టర్లు, ఇతర యుద్ధ సామగ్రిని అందించే ఒప్పందంపై రేపు నేను సంతకం చేయబోతున్నా."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

బ్రహ్మాండమైన వాణిజ్య ఒప్పందం...

భారత్​-అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వాణిజ్య ఒప్పందానికి అడ్డంకులు తొలగించే చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.

భారత భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, క్లాసిక్​ సినిమాలు, బాంగ్రా నృత్యాలు, పండుగలు వంటి అనేక విషయాల గురించి మాట్లాడారు ట్రంప్. దిగ్గజ క్రికెటర్లు సచిన్​, విరాట్​ కోహ్లీ గురించి ప్రస్తావించారు.

భారత్​కు నమ్మకమైన స్నేహితుడిగా అమెరికా ఉంటుందని ట్రంప్​ హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప నాయకుడిగా, తన మిత్రుడిగా అభివర్ణించారు.

Last Updated : Mar 2, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.