ప్రపంచంలోనే అతి పెద్దదైన భారత రాజ్యాంగంలో ఎన్నో దేశాల మేలైన లక్షణాలు ఒదిగిపోయాయి. ఒక్కో దేశ రాజ్యాంగం నుంచి ఒక విధానం చొప్పున, 10 దేశాల్లో విజయవంతమైన వాటిని స్ఫూర్తిగా తీసుకున్నాం.
బ్రిటన్...
పార్లమెంటరీ వ్యవస్థలకు మాతృక లాంటి బ్రిటన్ నుంచి.. పార్లమెంటరీ ప్రభుత్వం, చట్టాల రూపల్పన ప్రక్రియ, ఏక పౌరసత్వం, మంత్రిమండలి వ్యవస్థ, పార్లమెంటరీ అధికారాలు, ద్వి సభల విధానం, స్పీకర్ వ్యవస్థ.
ఐర్లాండ్...
ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్యసభకు, సభ్యులకు రాష్ట్రపతి నామినేట్ చేసే విధానం.
అమెరికా...
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యకలాపాలు, రాష్ట్రపతి అభిశంసన, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తొలగింపు, ప్రాథమిక హక్కులు న్యాయ సమీక్ష, న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, రాజ్యాంగ ప్రవేశిక.
కెనడా...
శక్తిమంతమైన కేంద్ర ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థ, కేంద్రం-రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, కేంద్రానికి అవశిష్ట అధికారాలు, గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు పరిధి.
ఆస్ట్రేలియా..
ఉమ్మడి జాబితా అంశం, ఉభయ సభల సంయుక్త సమావేశం(అధికరణ 108), దేశంలోని రాష్ట్రాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం.
యూఎస్ఎస్ఆర్(ప్రస్తుత రష్యా)...
ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళిక విధానం.
జర్మనీ..
అత్యయిక పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు, ఆ సమయంలో కేంద్రానికి అదనపు అధికారాలు.
దక్షిణాఫ్రికా...
రాజ్యసభ సభ్యుల ఎన్నిక, రాజ్యాంగ సవరణలు.
జపాన్..
న్యాయ సూత్రాలు.