ETV Bharat / bharat

'భారత్​తో దురుసుగా ప్రవర్తిస్తే దీటుగా జవాబిస్తాం' - భారత్ చైనా సరిహద్దు వివాదం

భారత్​ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, ఎవరైనా చెడు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం దీటైన సమాధానం ఇస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. చైనాపై డిజిటల్ యుద్ధం దిశగా ఆ దేశ యాప్​లను నిషేధించిన నేపథ్యంలో ఇలా స్పందించారు ప్రసాద్​.

WB-PRASAD
రవిశంకర్ ప్రసాద్
author img

By

Published : Jul 2, 2020, 1:57 PM IST

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్​ డిజిటల్ స్ట్రైక్ చేసిందని కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారత్​పై దురుద్దేశంతో వ్యవహరించేవారికి దీటుగా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.

బంగాల్​ ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. చైనా యాప్​లపై నిషేధం గురించి మాట్లాడారు.

"మనం ఇప్పుడు రెండు 'సీ'ల గురించి వింటున్నాం... కరోనా వైరస్, చైనా. భారత్​ శాంతిని కోరుకుంటుంది. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని విశ్వసిస్తుంది. ఎవరైనా భారత్​ను దురుద్దేశంతో చూస్తే వారికి దీటైన సమాధానం ఇస్తుంది.

మన సైనికులు 20 మంది ప్రాణత్యాగం చేసినా.. అవతలివైపు అంతకు రెట్టింపు మరణాలు సంభవించాయి. కానీ వాళ్లు స్పష్టమైన సంఖ్య చెప్పటం లేదు."

- రవిశంకర్ ప్రసాద్​

ప్రధాని నరేంద్రమోదీ బలమైన నాయకుడని ప్రశంసించారు ప్రసాద్​. జవాన్ల ప్రాణత్యాగాలు వృథా పోవని హామీ ఇచ్చారని చెప్పారు. ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ ఎలా స్పందించిందో గుర్తుచేసుకోవాలన్నారు. వీటిని నెరవేర్చే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు.

వ్యతిరేకత ఎందుకు?

దేశ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు చైనా యాప్​లపై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేసిందన్నారు ప్రసాద్. అయితే ఈ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. అంతేకాకుండా భారత్- చైనా సరిహద్దు వివాదంపై సీపీఎం పార్టీ ఎందుకు మౌనంగా ఉందన్నారు. ఇప్పుడున్నది 1962 నాటి పార్టీ కాదా? అని విమర్శించారు.

ఇదీ చూడండి: 'బాయ్​కాట్​ చైనాతో మేక్ ఇన్​ ఇండియాకు దెబ్బ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.