ETV Bharat / bharat

సరిహద్దులో యథాతథ స్థితి నెలకొల్పాల్సిందే - లెఫ్టినెంట్ చర్చలు

భారత్-చైనా మధ్య శనివారం జరగబోయే లెఫ్టినెంట్ జనరల్​ల సమావేశంలో సరిహద్దు ఉద్రిక్తతలను ప్రస్తావించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాంగోంగ్ సో, గాల్వన్ లోయ, దెమ్​చొక్ ప్రాంతాల్లో యథాతథ స్థితిని నెలకొల్పే విషయంపై భారత్ పట్టుబట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

India to bring specific proposals to military talks with China on Saturday: Sources
భారత్ చైనా చర్చలు
author img

By

Published : Jun 4, 2020, 6:33 AM IST

భారత్, చైనా మధ్య శనివారం జరగనున్న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చల్లో సరిహద్దు సమస్యల పైనే ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. పాంగోంగ్ సో, గాల్వన్ లోయ, దెమ్​చొక్ ప్రాంతాల్లో ఘర్షణలకు సంబంధించిన చర్చలపై ప్రతిపాదన తీసుకురానున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో యథాతథ స్థితిని నెలకొల్పే విషయంపై భారత్ పట్టుబట్టే అవకాశం ఉందన్నారు.

లేహ్​లోని 14వ కార్ప్స్​ కమాండింగ్ అధికారి.. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ భారత్​ తరఫున ఈ భేటీకి హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. చైనా సైతం ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకొస్తుందనే ఆశిస్తున్నట్లు సీనియర్ మిలిటరి అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఇరుదేశాల స్థానిక కమాండర్లు 10 సార్లు చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడం వల్ల ఏకంగా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 6న ఈ సమావేశం జరగనుంది. సరిహద్దులోని ఓ సమావేశ స్థలంలో ఈ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.