ETV Bharat / bharat

హైపర్​సోనిక్​ సాంకేతికత ప్రయోగం విజయవంతం - హైపర్​సోనిక్ క్షిపణి వాహక నౌక

హైపర్​సోనిక్​ సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వాహక నౌకను వీలర్​ ఐలాండ్​ నుంచి ప్రయోగించారు. ఈ విజయంపై శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ అభినందనలు తెలిపారు.

hypersonic technology demonstrator vehicle
హైపర్​సోనిక్​
author img

By

Published : Sep 7, 2020, 2:14 PM IST

దేశీయంగా అభివృద్ధి చేసిన 'హైపర్​సోనిక్​ సాంకేతిక క్షిపణి వాహక నౌక' (హెచ్​ఎస్​టీడీవీ)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. భవిష్యత్తులో సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలకు ఇది ఆసరాగా నిలిచి, వైమానిక అవసరాలను తీర్చగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ హైపర్​సోనిక్ సాంకేతికతను భారత రక్షణ పరిశోధన సంస్థ- డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఒడిశా వీలర్ ఐలాండ్​లోని డాక్టర్​ ఏపీజే అబ్దుల్​ కలాం లాంచ్ కాంప్లెక్స్​ నుంచి ఈ వాహక నౌకను ప్రయోగించింది.

  • #WATCH DRDO‘s successful demonstration of the Hypersonic air-breathing scramjet technology with the flight test of Hypersonic Technology Demonstration Vehicle, at 1103 hours today from Dr. APJ Abdul Kalam Launch Complex at Wheeler Island, off the coast of Odisha pic.twitter.com/aC1phjusDH

    — ANI (@ANI) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజ్​నాథ్ అభినందనలు..

ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లైందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

hypersonic technology demonstrator vehicle
రాజ్​నాథ్​ ట్వీట్​

"గొప్ప విజయాన్ని సాధించిన డీఆర్​డీఓకు శుభాకాంక్షలు. ప్రధాని మోదీ కల- ఆత్మనిర్భర్‌ భారత్‌ వాస్తవ రూపం దాల్చడానికి ఇది కీలక పరిణామం. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోంది."

- రాజ్​నాథ్​ సింగ్​

భవిష్యత్తు అవసరాలు..

ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల అత్యంత సంక్లిష్టమైన సాంకేతికత భారత్​ సొంతమైందని డీఆర్​డీఓ అధికారి ఒకరు చెప్పారు. దేశీయ రక్షణ పరిశ్రమల భాగస్వామ్యంతో కొత్త తరం హైపర్​సోనిక్​ వాహక నౌకల నిర్మాణానికి ఇది అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఆ దేశాల సరసన..

ఇప్పటికే హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ ఆయుధాలు సమకూర్చుకోవడంలో అగ్రరాజ్యం అమెరికాతోపాటు రష్యా, చైనా దేశాలు ముందున్నాయి. తరువాత ఫ్రాన్స్‌, భారత్‌, ఆస్ట్రేలియా కూడా ఈ తరహా టెక్నాలజీ పరీక్షల్లో నిమగ్నమయ్యాయి. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ హైపర్‌సోనిక్‌ టెక్నాలజీతో భారత్‌ ఆ మూడు దేశాల సరసన చేరింది.

ఇదీ చూడండి: 'పొరుగు దేశాల వ్యూహాలను తిప్పికొట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.