ETV Bharat / bharat

కశ్మీర్ మ్యాప్​పై వికీపీడియాకు కేంద్రం నోటీసులు - వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

జమ్ముకశ్మీర్ మ్యాప్​ను తప్పుగా చూపించిన వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన లింక్​ను తొలగించాలని ఆదేశించింది. నవంబర్ 27న ఈ నోటీసులు పంపించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ మ్యాప్​ను వికీపీడియా సరిచేయలేదు.

India tells Wikipedia to remove link showing wrong map of Jammu and Kashmir
జమ్ము మ్యాప్​పై వికీపీడియాకు కేంద్రం నోటీసులు
author img

By

Published : Dec 2, 2020, 10:55 PM IST

జమ్ము కశ్మీర్​కు మ్యాప్​ను తప్పుగా చూపించినందుకు వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వెబ్​సైట్​లోని తప్పుడు మ్యాప్​కు చెందిన లింక్​ను తొలగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

ఓ ట్విట్టర్​ వినియోగదారులు చేసిన ట్వీట్​ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్​, ఐటీ మంత్రిత్వ శాఖ నవంబర్ 27న నోటీసు పంపించినట్లు చెప్పారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉన్న ఈ పేజీని వెబ్​సైట్ నుంచి తొలగించాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆదేశాలను వికీపీడియా పాటించకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని అన్నారు.

ఇప్పటివరకైతే వికీపీడియా ఈ మ్యాప్​ను సరిచేయలేదు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.