ETV Bharat / bharat

'ఫింగర్​ ఏరియాలో బలగాల ఉపసంహరణపైనే చర్చ' - india china news

తూర్పు లద్దాఖ్​లో ఫింగర్​ ఏరియా, ఇతర ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకునే అంశంపైనే భారత్​-చైనా మధ్య కార్ప్స్​ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరే ఇతర విషయాన్ని ప్రస్తావించడం లేదని పేర్కొన్నాయి.

india-talking-to-china-on-disengagement-from-finger-area-friction-points-in-eastern-ladakh
'ఫింగర్​ ఏరియాలో బలగాల ఉపసంహరణపైనే చర్చ'
author img

By

Published : Aug 2, 2020, 7:03 PM IST

సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలనే విషయంపై భారత్​-చైనా మధ్య కార్ప్స్​ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఫింగర్​ ఏరియా సహా ఇతర ఫ్రిక్షన్​ పాయింట్ల నుంచి చైనా బలగాలను వెనక్కి మళ్లించాలనే విషయంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరే ఇతర అంశాన్ని భేటీలో ప్రస్తావించడం లేదని స్పష్టం చేశాయి.

ఈ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న తర్వాతే ఇతర విషయాలపై మరోసారి చర్చలు జరపాలని చైనాకు భారత్ తేల్చి చెప్పినట్లు సమాచారం.

కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చల్లో మాట్లాడాల్సిన అంశాలపై చైనా అధ్యయన బృందం(సీఎస్​జీ) సలహాలు, సూచనలు ఇస్తోంది. విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, సైనికాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.