ETV Bharat / bharat

'హిందూ మహా సముద్రంలోనూ చైనా కుట్రలు' - చైనా విస్తరణ కాంక్ష- హిందూ మహా సముద్రంలోనూ కుట్రలు

విస్తరణవాదంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు ఆజ్యం పోసిన చైనా.. ఇప్పుడు హిందూ మహా సముద్రంలోనూ అలజడులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాంతంలో తన స్థావరాలను విస్తరించుకోవడంపై చైనా దృష్టిసారించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

India should tighten its ties with IOR neighbours to counter Chinese movements: Experts
హిందూ సముద్రంలోనూ చైనా కుట్రలు
author img

By

Published : Jun 29, 2020, 6:05 PM IST

హిందూ సముద్ర ప్రాంత(ఐఓఆర్) భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణులు సూచించారు. వాస్తవాధీన రేఖ వెంబడే కాకుండా ఐఓఆర్ ప్రాంతంలోనూ తన స్థావరాలను విస్తరించుకోవడానికి చైనా దృష్టిసారించిందని వెల్లడించారు.

ఇదీ చదవండి- చైనా సైన్యం చేతిలో అధునాతన రక్షణ వ్యవస్థ

ఈ ప్రాంతంలో చైనా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న నిపుణులు ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

"మాల్దీవుల్లోని ఫెయ్​ధూ ఫినోల్హూ రిసార్ట్ ద్వీపం, శ్రీలంకలోని హంబన్​టోట ఓడరేవులలో చైనా తన ప్రాదేశిక ఆస్తులు కలిగి ఉంది. అంతేకాకుండా మట్టలా అంతర్జాతీయ విమానాశ్రయం, కొలొంబో ఓడరేవు నగరం, ఎక్స్​ప్రెస్ వే ప్రాజెక్టులపై వేల కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ భారతదేశం జాగ్రత్తగా ఉండాలని చెప్పే పరిణామాలు."

-ఎన్ సత్యమూర్తి, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌడేషన్

ఫెయ్​ధూ ఫినోలూను అబ్దుల్లా యామీన్ హయాంలో 4 మిలియన్ డాలర్లతో చైనా 50 ఏళ్లకు లీజుకు తీసుకుందని సత్యమూర్తి గుర్తు చేశారు. హంబన్​టోట ప్రాంతాన్ని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి చర్చలు ప్రారంభించాలని కేంద్రానికి అభ్యర్థించారు.

"జపాన్, సింగపూర్​లతో కలిసి తూర్పు శ్రీలంకలో త్రికోణమల్లే పోర్టును భారత్ అభివృద్ధి చేస్తున్నప్పటికీ.. ఈ సమూహాన్ని కలిపి ఉంచడం చాలా ముఖ్యం. చైనా తన ఈ ప్రాంతంలో విశ్వసనీయంగా ఎలా ఉందనేది ఆశ్చర్యకరం. ఐఓఆర్ దేశాలను మనకు వ్యతిరేకంగా నడుచుకునేలా చైనా ఒత్తిడి తీసుకురావచ్చు. ప్రస్తుతం భారత్ తనకోసమే కాకుండా పొరుగువారి కోసం కూడా అంతర్జాతీయ దేశాలతో చర్చించే స్థితిలో ఉంది."

తూర్పు ఆఫ్రికా సముద్రంలోని జిబౌటీలో ఓ నావికా స్థావరాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది చైనా. 2017లో సరకు రవాణా కోసం నెలకొల్పిన ఈ స్థావరాన్ని క్రమంగా పూర్తి స్థాయి నావికాదళ స్థావరంగా మార్చింది. యుద్ధనౌకలను సైతం మోహరించేలా తీర్చిదిద్దింది. ఈ ప్రాంతం నుంచి మాల్దీవుల్లోని తన స్థావరాలకు చైనా చాలా సులభంగా చేరుకోవచ్చు.

ఇదీ చదవండి- జనాభా కట్టడి పేరిట ముస్లింలపై చైనా క్రూరత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.