ETV Bharat / bharat

బ్రహ్మోస్ ఆదాయం అంతా క్షిపణి అభివృద్ధికే!

author img

By

Published : Jun 12, 2020, 7:05 PM IST

Updated : Jun 12, 2020, 7:27 PM IST

బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్షిపణి అభివృద్ధికే కేటాయించేలా భారత్​- రష్యా ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణుల కొనుగోలుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు ప్రారంభమయ్యాయని.. వచ్చే ఏడాదికల్లా ఒప్పందంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.

Brahmos missile export only for R&D
బ్రహ్మోస్ ఆదాయం అంతా క్షిపణి అభివృద్ధికే!

భారత్​- రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా పరిశోధనాభివృద్ధికే వెచ్చించాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

"బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని 100 శాతం క్షిపణి అభివృద్ధికే ఖర్చు చేయడానికి భారత్, రష్యా అంగీకరించాయి. క్రూయిజ్ క్షిపణిని సాంకేతికంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది."

-అధికార వర్గాలు

ఆసియా, లాటిన్ అమెరికాలోని నాలుగు దేశాలు బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భూఉపరితలంతో పాటు జలాంతర్గాములు, ఓడల నుంచి ప్రయోగించగలిగే క్షిపణులను దక్కించుకోవడానికి ఆయా దేశాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, మలేసియా, బ్రెజిల్, చిలీ, వెనెజువెలా వంటి దేశాలు ఇందుకోసం చర్చలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయా దేశాలతో భారత్​కు ఉన్న సంబంధాల ఆధారంగానే ఎగుమతులు ఉంటాయని స్పష్టం చేశాయి. బ్రహ్మోస్ ఎగుమతి కోసం ఓ దేశంతో జరుపుతున్న చర్చలు ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదినాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

"ఎగుమతుల ప్రణాళికకు కొవిడ్-19 మహమ్మారి వల్ల భంగం వాటిల్లింది. ఫలితంగా ఈ ఒప్పందాలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతానికైతే గాల్లో నుంచి ప్రయోగించగలిగే బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులను అనుమతించడం లేదు."

-అధికార వర్గాలు

వర్టికల్ డీప్​-డైవ్​ సామర్థ్యం ఉన్న బ్రహ్మోస్ క్షిపణి రకాన్ని సిద్ధం చేయడానికి భారత్ ఆసక్తి చూపుతోందని అధికారులు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే హిమాలయాల వంటి కొండ ప్రాంతాల్లో యుద్ధం సంభవిస్తే భద్రత దళాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.

1998లో ఒప్పందం

ఈ బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి భారత్, రష్యా 1998లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీఆర్​డీఓ, రష్యాకు చెందిన ఎన్​పీఓ మషినస్త్రోయెనియా సంస్థల భాగస్వామ్యంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ వీటిని తయారు చేస్తోంది. ఇందులో భారత్​కు 50.5 శాతం వాటా ఉండగా.. రష్యా 49.5 శాతం వాటా కలిగి ఉంది. భారత్​లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్ల కలయికతో ఈ క్షిపణికి బ్రహ్మోస్​గా నామకరణం చేయడం విశేషం.

మూడు టన్నుల బరువైన బ్రహ్మోస్-2 క్షిపణి 450 కి.మీ దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. గంటకు 3,347 కి.మీ వేగంతో 300 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు.

(రచయిత- సంజీవ్ బారువా)

Last Updated : Jun 12, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.