ETV Bharat / bharat

రక్షణ రంగంలో మరింత సహకారం

రక్షణ రంగంలో భారత్​, రష్యాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా అత్యాధునిక ఏకే 203 రైఫిళ్లను రష్యా సహకారంతో మన దేశంలో తయారుచేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రష్యా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఆ దేశ రక్షణ మంత్రితో చర్చల అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు.

India, Russia finalise AK-47 203 rifles deal: Report
రక్షణ రంగంలో మరింత సహకారం
author img

By

Published : Sep 4, 2020, 7:23 AM IST

రక్షణ రంగంలో భారత్​, రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ మేరకు పరస్పర సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని ఇరుదేశాలు తాజాగా నిర్ణయించాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఆ దేశ రక్షణ మంత్రి జనరల్​ సెర్గీ షొయిగుతో గురువారం భేటీ అయ్యారు.

రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచుకోవడం సహా.. పలు అంశాలపై రాజ్​నాథ్​, షొయిగులు చర్చలు జరిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా భారత్​కు ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రి, ఇతర రక్షణ పరికరాల సరఫరాను వేగిరం చేయాల్సిందిగా రష్యాను​ కోరారు రాజ్​నాథ్. సెర్గీతో తన భేటీ అద్భుతంగా సాగిందని ట్విట్టర్​ వేదికగా భారత రక్షణ మంత్రి తెలిపారు. 'భారత్​లో తయారీ'కి అండగా నిలుస్తామని రష్యా హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

ఏకే 203 రైఫిళ్ల తయారీపై ఒప్పందం ఖరారు

అత్యాధునిక ఏకే 203 రైఫిళ్లను రష్యా సహకారంతో మన దేశంలో తయారుచేసుకునేందుకు మార్గం సుగమమైంది. రాజ్​నాథ్​ సింగ్​ రష్యా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధిత ఒప్పందం ఖరారైంది.

ఇదీ చదవండి: కారు నడుపుతున్నప్పుడు మాస్క్​ ధరించాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.