ETV Bharat / bharat

అగ్రరాజ్యాధిపతికి అదిరే స్వాగతం- రోడ్​ షోలో జన నీరాజనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. రెండు రోజుల పర్యటనలో భాగంగా కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం భారత్​కు చేరుకున్నారు. అహ్మదాబాద్​ విమానాశ్రయంలో అగ్రరాజ్యాధిపతికి అదిరే స్వాగతం పలికారు నేతలు. విమానం వద్దకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుని డొనాల్డ్​ ట్రంప్​ను ఆలింగనం చేసుకుని, సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు మోటేరా స్టేడియం వరకు భారీ రోడ్​ షోలో పాల్గొన్నారు.

India rolls out cultural extravaganza to welcome Trump
అగ్రరాజ్యాధిపతికి అదిరే స్వాగతం
author img

By

Published : Feb 24, 2020, 5:32 PM IST

Updated : Mar 2, 2020, 10:24 AM IST

అగ్రరాజ్యాధిపతికి అదిరే స్వాగతం

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చిరకాలం గుర్తుండిపోయే విధంగా అద్భుత ఆతిథ్యం ఇచ్చింది భారత్​. అహ్మదాబాద్​లోని సర్దార్​ వల్లాభ్​భాయ్ పటేల్​​ విమానాశ్రయంలో భార్య మెలానియా ట్రంప్​తో కలిసి విమానం దిగిన ట్రంప్​ను హత్తుకుని సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం ఇరువురు నేతలు ఎర్ర తివాచీపై హుందాగా నడుస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించారు.

షెడ్యూలు కన్నా ముందే..

ఉదయం 11:40 గంటలకు అధికారిక షెడ్యూల్​ ఉండగా మూడు నిమిషాల ముందే 11:37 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంది అధ్యక్షుడి విమానం ఎయిర్​ఫోర్స్​ వన్​. అధ్యక్షుడు ట్రంప్​తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్​, కుమార్తె ఇవాంక, అల్లుడు జరెడ్​ కుష్నెర్​ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

రోడ్​ షోలో జన నీరాజనాలు..

విమానాశ్రయం నుంచి మోటేరా క్రికెట్​ స్టేడియం వరకు భారీ రోడ్​ షోలో పాల్గొన్నారు ఇరువురు నేతలు. అయితే భద్రత కారణాల దృష్టా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్​ వేరు వేరు వాహనాల్లో ప్రయాణించారు. రోడ్​ షో మార్గంలో ఇరువైపుల వందల సంఖ్యలో ప్రజలు అధ్యక్షుడు ట్రంప్​కు నీరాజనాలు పట్టారు. నమస్తే ట్రంప్​ అంటూ నినాదాలు చేశారు. వివిధ వేషధారణలతో అధ్యక్షుడి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలిపే విధంగా పలు ప్రదర్శనలు చేపట్టింది గుజరాత్​ ప్రభుత్వం. అందుకోసం 50 వేదికలు ఏర్పాటు చేసింది. ఈ వేదికలపై సంగీత, వాయిద్య, నృత్య కళాకారులు ప్రదర్శనలు చేశారు. అధ్యక్షుడి కారు తమ వేదిక సమీపంలోకి చేరుకోగానే రెట్టించిన ఉత్సాహంతో నృత్యాలు చేశారు.

సబర్మతి ఆశ్రమానికి ట్రంప్

రోడ్​ షోలో భాగంగా మహాత్ముడు నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు ట్రంప్​ దంపతులు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ జీవితంలో ఒక భాగంగా మారిన రాట్నం తిప్పుతూ దాని ప్రాధాన్యాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ విశేషాలను ట్రంప్​కు వివరించారు మోదీ. "చెడు వినకు- చెడు చూడకు- చెడు మాట్లాడకు" అని సందేశమిచ్చే 3 కోతుల ప్రతిమను ట్రంప్​కు బహూకరించారు మోదీ.

India rolls out cultural extravaganza to welcome Trump
సబర్మతి ఆశ్రమంలో రాట్నం తిప్పుతున్న ట్రంప్​ దంపతులు

అనంతరం సందర్శకుల పుస్తకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ తమ సందేశం రాశారు ట్రంప్​ దంపతులు. అద్భుతమైన పర్యటనగా కొనియాడారు.

ఆశ్రమం నుంచి మోటేరాకు..

ఆశ్రమ సందర్శన అనంతరం మోటేరా స్టేడియానికి చేరుకున్నారు ట్రంప్​. నమస్తే ట్రంప్​ కార్యక్రమంలో భారత్​తో ఉన్న వాణిజ్య, రక్షణ వంటి కీలక రంగాల్లోని భాగస్వామ్యంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా హాజరయ్యారు. ​

ఇదీ చూడండి: 'భారత్​-అమెరికా మధ్య అద్భుత వాణిజ్య ఒప్పందం'

Last Updated : Mar 2, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.