ETV Bharat / bharat

కరోనాకు మరో ఇద్దరు బలి- 29కి చేరిన మరణాలు - coronavirus in india

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. భారత్​లోనూ ఈ మహమ్మారి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బంగాల్​, గుజరాత్​లో ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 29కి చేరింది. మహారాష్ట్రలో-12, మధ్యప్రదేశ్​లో మరో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్​గా వచ్చింది.

India reports two more corona deaths today
కరోనా మహమ్మారి: దేశంలో ఇద్దరు మృతి, కొత్తగా 22 కేసులు
author img

By

Published : Mar 30, 2020, 10:45 AM IST

Updated : Mar 30, 2020, 10:59 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కేసుల సంఖ్యతో పాటు మృతులు కూడా అంతకంతకూ పెరుగుతున్నారు. వైరస్​ కారణంగా దేశంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొవిడ్​-19 మృతుల 29కి చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 942 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 99 మంది కోలుకున్నట్లు వెల్లడించింది.

బంగాల్​, గుజరాత్​లో ఇద్దరు మృతి

బంగాల్​లో కరోనా వైరస్​తో మరొకరు వృత్యువాతపడ్డారు. డార్జిలింగ్​ జిల్లాలోని కలియంపోంగ్​కు చెందిన 44 ఏళ్ల మహిళ.. ఉత్తర బంగాల్ ప్రభుత్వ​ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలు ఇటీవలే చెన్నై నుంచి తిరిగివచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాల్​లో కొవిడ్​-19 కేసుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఇద్దరు మృతి చెందారు.

గుజరాత్​లోనూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాలు సంఖ్య 6కు చేరింది.

మహారాష్ట్రలో 215

దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో తాజాగా మరో 12 కేసులు బయటపడ్డాయి. ఇందులో పుణె-5, ముంబయి-3, నాగ్​పుర్​-2, కొల్హాపుర్​, నాశిక్​ నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 215కు చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మధ్యప్రదేశ్​లో 47

మధ్యప్రదేశ్​లో మరో 8 మందికి కరోనా పాజిటివ్​గా వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 47కు చేరింది. తాజాగా నమోదైన వాటిలో ఇండోర్​-7, ఉజ్జయిన్​ నుంచి ఒకటి గుర్తించారు. 47 మందిలో ఇప్పటికే ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

పంజాబ్​లో 39

మొహాలీలో 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్​గా వచ్చింది. అతడితో కలిపి పంజాబ్​లో కొవిడ్​-19 కేసుల సంఖ్య 39కి చేరింది. ఇందులో నవన్​షహర్​-19, మొహాలీ-7, హోషియాపుర్​-6, జలంధర్​-5, అమృత్​సర్​, లూధియానా నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి. పంజాబ్​లో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. ఒకరు డిశ్చార్చ్​ అయ్యారు.

గుజరాత్​లో 69

గుజరాత్​లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలినందున.. రాష్ట్రంలో కొవిడ్​-19 సోకినవారి సంఖ్య 69కి చేరింది.

రాజస్థాన్​లో మరో కేసు

రాజస్థాన్​లో జోధ్​పుర్​లోనూ 41 ఏళ్ల లడఖ్​ స్థానికుడికి కరోనా పాజిటివ్​గా వచ్చింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి కేసుల సంఖ్య 60కి చేరింది

Last Updated : Mar 30, 2020, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.