భారత్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 63,371 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 73 లక్షల 70 వేలు దాటింది. మరో 895 మరణించారు.
ఇప్పటివరకు 64,53,779 మంది కోలుకోవడం వల్ల రికవరీ రేటు 87.56కు చేరింది. మరణాల రేటు 1.52కు తగ్గింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారీగా నిర్ధరణ పరీక్షలను చేస్తున్నారు. మరో 10 లక్షల 28వేల 622 మందిని పరీక్షించారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 9కోట్ల 22 లక్షల 54 వేలు దాటింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సమర్థమైన చర్యలు తీసుకోవడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: మూడోదశ క్లినికల్ ట్రయల్స్ వివరాలు కోరిన డీసీజీఐ