ముస్లిం మహిళల రక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ముమ్మారు తలాక్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. ముస్లిం మహిళలకు జరగుతున్న అన్యాయాన్ని పార్లమెంటు సరిచేసిందని ట్వీట్ చేశారు.
"ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ సరి చేసింది. ఈ బిల్లుతో మహిళా సాధికారతతో పాటు ముస్లిం మహిళలు సమాజంలో గౌరవంగా జీవిస్తారు. లింగ సమానత్వానికి ఇది దోహదపడుతుంది. ముస్లిం మహిళలను ఇబ్బందిపెడుతున్న పురాతన ఆచారాన్ని పార్లమెంట్ చెత్తబుట్టలో పడేసింది. దేశం ఎంతో సంతోషిస్తోంది. "
-ప్రధాని మోదీ ట్వీట్.
ట్రిపుల్ తలాక్ కారణంగా కష్టాలుపడిన ముస్లిం మహిళల ధైర్య సాహసాలను కొనియాడారు మోదీ. ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి చొరవ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు.