దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. మంగళవారంతో పోలిస్తే.. కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 11,039 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 110 మంది మరణించారు.
- మొత్తం కేసులు: 10,777,284
- యాక్టివ్ కేసులు: 1,60,057
- కోలుకున్నవారు: 1,04,62,631
- మొత్తం మరణాలు: 1,54,596
కరోనా సోకినవారిలో మరో 14,225 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 97.08 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.43 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా మరో 7లక్షల 21వేల 121 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 19కోట్ల 84లక్షలకు పెరిగింది.
మరోవైపు.. దేశంలో మంగళవారం రోజు సుమారు 1లక్షా 70వేల మందికి టీకా అందించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 41 లక్షల 38వేల మంది లబ్ధిదారులు టీకా పొందినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: కొవిడ్ టీకాపై సంకోచమే అసలు సమస్య