ETV Bharat / bharat

వైద్య సామగ్రితో నేడు వుహాన్​కు ప్రత్యేక విమానం

చైనా వుహాన్​లో చిక్కుకున్న పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. వైద్య, సహాయ సామగ్రితో ప్రత్యేక ఐఏఎఫ్ విమానాన్ని నేడు చైనాకు పంపిస్తోంది. ఈ సారి సుమారు 90 నుంచి 100 మందిని భారత్​కు తీసుకురానుంది.

India prepares to evacuate remaining Indians from virus-hit Wuhan
వుహాన్​లో చిక్కుకున్న భారత పౌరుల కోసం ప్రత్యేక విమానం
author img

By

Published : Feb 26, 2020, 5:32 AM IST

Updated : Mar 2, 2020, 2:38 PM IST

కరోనా వైరస్​తో దెబ్బతిన్న చైనా నగరం వుహాన్​లో చిక్కుకున్న భారత పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత్​ సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం వైద్య, సహాయ సామగ్రితో ప్రత్యేక ఐఏఎఫ్ విమానాన్ని చైనాకు నేడు పంపుతోంది.

"ప్రత్యేక విమానం ద్వారా వుహాన్​లో ఉన్న మన పౌరులను భారత్​కు రప్పించడానికి కృషి చేస్తున్నాం."

- భారత రాయబార కార్యాలయం

పొరుగువారికి కొంత సాయపడతాం

ఈ ప్రత్యేక విమానంలో 90 నుంచి 100 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే పొరుగు దేశాల పౌరులను కూడా తరలించడానికి భారత్​ సుముఖత వ్యక్తం చేసింది.

భారత వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్​మాస్టర్​ వైద్య సామగ్రితో చైనాకు పంపడానికి భారత్​ చాలా రోజులు ప్రయత్నించింది. అయితే చైనా అందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ వాదనను తోసిపుచ్చిన చైనా చివరికి భారత విమానానికి అనుమతి ఇచ్చింది.

చైనాను గడగడలాడిస్తున్న కొవిడ్​ 19ను ఎదుర్కొనేందుకు అవసరమైన మెడికల్ గ్లౌజులు, సూట్లు, ఇతర సహాయ సామగ్రిని ఈ ప్రత్యేక విమానం తీసుకెళ్లనుంది. భారత్ ఇప్పటికే రెండు విమానాలతో 647 మంది భారత పౌరులను, ఏడుగురు మాల్డీవుల పౌరులను చైనా నుంచి తీసుకొచ్చింది.

మరణ మృదంగం

కరోనా వైరస్​ వల్ల చైనాలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 2,663కి చేరుకుంది. మరో 77,658 మందికి వైరస్​తో బాధపడుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా బారిన ఇరాన్ ఆరోగ్య మంత్రి

Last Updated : Mar 2, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.