ముంబయి ఉగ్రదాడుల్లో అసువులు బాసిన పోలీసులు, పౌరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరువలేదని పేర్కొన్నారు.
"2008లో ఇదే రోజు.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారు. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద దాడి. విదేశీ పౌరులతో సహా పోలీసులు చనిపోయారు. వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. భారత్ ఈ గాయాలను ఎన్నటికీ మరవదు. ఇప్పుడు భారత్ కొత్త విధానాలతో ఉగ్రవాదంపై పోరాడుతోంది. ఇందులో భాగమైన భద్రతా బలగాలకు నమస్కరిస్తున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
జమిలీ ఎన్నికలపై..
'ఒక దేశం, ఒక ఎన్నిక' భారత్కు చాలా అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నెలల వ్యవధిలో దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఇది అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోందన్నారు. ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలని ప్రిసైడింగ్ అధికారులకు మోదీ సూచించారు.
ఇదీ చూడండి: 26/11 ముంబయి ఉగ్ర దాడులకు 12 ఏళ్లు