ETV Bharat / bharat

'గల్వాన్​పై మే నెల నుంచే చైనా కుట్ర' - india china standoff

తూర్పు లద్దాఖ్​ ప్రతిష్టంభనకు చైనాదే బాధ్యతని భారత్ తేల్చి చెప్పింది. మే నెల ప్రారంభం నుంచే ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే సైనికుల మధ్య ఘర్షణ చెలరేగిందని స్పష్టం చేసింది.

SINOINDIA-LADAKH-MEA
విదేశాంగ శాఖ
author img

By

Published : Jun 25, 2020, 6:48 PM IST

Updated : Jun 25, 2020, 8:18 PM IST

చైనా వైఖరితోనే తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతలు తలెత్తాయని భారత్​ వెల్లడించింది. మే నెల ప్రారంభంలోనే యథాతథ స్థితిని మార్చాలంటూ చైనా ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. భారత్​ దానికి ఒప్పుకోకపోవడం వల్ల సరిహద్దు వెంబడి బలగాల మోహరింపుతో ఉద్రిక్తతలకు తెరతీసిందని చెప్పుకొచ్చింది.

తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన దగ్గరి నుంచి జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. తూర్పు లద్ధాఖ్ ప్రతిష్టంభనకు చైనాదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.

  • మే ప్రారంభంలో గాల్వన్ లోయ ప్రాంతంలో భారతదేశం సాధారణ, సాంప్రదాయ గస్తీని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. మే రెండో వారంలో పశ్చిమ సెక్టార్​లోని కొన్ని ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చాలని కోరింది.
  • చైనా చర్యలకు దౌత్య, సైనిక మార్గాల్లో నిరసన తెలిపాం. ఇలాంటి మార్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాం.
  • ఈ నేపథ్యంలోనే జూన్​ 6న లెఫ్టినెంట్ జనరళ్ల మధ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా అధికారులు అంగీకారం తెలిపారు. వాస్తవాధీన రేఖను గౌరవించి, కట్టుబడి ఉండాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఎల్​ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి భారత్​ ఎప్పుడూ ప్రయత్నించలేదు.
  • ఈ క్రమంలో చైనా తొలుత వెనక్కు తగ్గినప్పటికీ మళ్లీ కొన్ని నిర్మాణాలు చేపట్టింది. దీనిపై జూన్​ 15న ప్రశ్నించగా చైనా బలగాల చర్యలు హింసాత్మక ఘర్షణలకు దారి తీశాయి. ప్రత్యక్ష ప్రాణనష్టానికి కారణమయ్యాయి.
  • అనంతరం రెండువైపులా భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. మరోవైపు సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: వెనక్కి తగ్గిన చైనా- గల్వాన్​ నుంచి బలగాలు వాపస్

Last Updated : Jun 25, 2020, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.