పాకిస్థాన్ విదేశాంగ శాఖకు భారత్ నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ అధికారులను ఈ నెల 8 నుంచి 11 మధ్య వేధింపులకు గురి చేయడం సహా పలు ఇతర ఆంశాలపై దర్యాప్తు చేయాలని భారత హై కమిషన్ నోటీసులో పేర్కొంది.
ఈనెల 9 నుంచి 10 మధ్య పాకిస్థానీ భద్రతా దళాలు భారత డిప్యూటి హై కమిషన్‌పై నిఘా ఉంచి అధికారులను అసౌకర్యానికి గురి చేశాయి. అంతకు ముందు మార్చి 8న భారత హై కమిషన్ కార్యదర్శి సైతం ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొన్నారు. హై కమిషన్‌ను రోజూ అనుకరించి వేధింపులకు గురిచేశారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ చేసింది.
ఈ చర్యలతోదౌత్యసంబంధాల్లో వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.