ETV Bharat / bharat

సైబర్ భద్రత కోసం 'ఫైవ్​ ఐస్'​తో భారత్ పొత్తు

అంతర్జాతీయ సైబర్ భద్రత, సహకారం, వ్యక్తిగత గోప్యత విషయంలో భారత్​ కీలక నిర్ణయం తీసుకుంది. రహస్య గూఢచర్యం, సమాచార భాగస్వామ్య నెట్​వర్క్​ 'ఫైవ్​-ఐస్​'లో చేరింది. ఈ సందర్భంగా టెక్​ కంపెనీలకు ఫైవ్​-ఐస్ దేశాల ప్రతినిధులతో పాటు భారత్​, జపాన్​.. కీలక ప్రతిపాదనలు చేశాయి.

Five-Eyes
ఫైవ్​ ఐస్'
author img

By

Published : Oct 13, 2020, 5:51 AM IST

రహస్య గూఢచర్యం, సమాచార భాగస్వామ్య నెట్​వర్క్​ 'ఫైవ్​-ఐస్​'లో చేరింది భారత్​. అంతర్జాతీయ సైబర్ భద్రత, సహకారం, వ్యక్తిగత గోప్యత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్​ సరైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై జపాన్​తోనూ చేతులు కలిపింది భారత్​. ఫలితంగా వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్​, ఫేస్​బుక్ మెసేంజర్​ మొదలైన వాటిలో ఎన్​క్రిప్ట్ చేసిన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

అమెరికా, బ్రిటన్​, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిసి 1941లో 'ఫైవ్​ ఐస్​'ను స్థాపించాయి. దౌత్య, భద్రత, సైనిక, ఆర్థిక రంగాల్లో ప్రయోజనాల కోసం ఇతర దేశాల సమాచారాన్ని పొందేందుకు దీన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ క్లబ్​లో భారత్​ చేరటం కీలక పరిణామంకానుంది.

ఈ సందర్భంగా టెక్​ కంపెనీలకు ఫైవ్​-ఐస్ దేశాల ప్రతినిధులతో పాటు భారత్​, జపాన్​.. కీలక ప్రతిపాదనలు చేశాయి. ఈ సంయుక్త ప్రకటనలో 'ఎండ్​-టు-ఎండ్​ ఎన్​క్రిప్షన్​' ద్వారా ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్లను ప్రస్తావించాయి. పరికరాలు, అప్లికేషన్లు, ఇతర ఇంటిగ్రేటెడ్​ ప్లాట్​ఫామ్స్​ వంటి గోప్యత సేవలకు సంబంధించి తమ స్పష్టమైన వైఖరిని చెప్పాయి.

"కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడం కీలకమైన అంశమే. గోప్యత, సైబర్​ భద్రతను తప్పనిసరిగా కాపాడాలి. అయితే ఇది ఆన్​లైన్​ ద్వారా చట్ట విరుద్ధమైన సమాచారం, కార్యాచరణకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. టెక్ పరిశ్రమపై బలవంతపు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకూడదు. గోప్యతకు సంబంధించిన ప్రోగ్రాముల్లో బ్యాక్​డోర్​ ద్వారా చట్టపరమైన సంస్థలకు సమాచారం పొందే విధంగా రూపొందించాలి."

-- భారత్​-జపాన్​ సంయుక్త ప్రకటన

దాదాపు రెండేళ్లుగా టెక్​ కంపెనీలకు ఇలాంటి ప్రతిపాదనలు చాలా చేసింది ఫైవ్​ ఐస్​. అయితే, వినియోగదారుల సమాచారంలో కొన్ని సమస్యల కారణంగా దీనిని అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాయి సంస్థలు. అయితే ఈ కూటమిలో భారత్​, జపాన్​ చేరిన నేపథ్యంలో.. తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 270కోట్ల మంది వినియోగదారులున్న వాట్సాప్​కు.. ఒక్క భారత్​లోనే అత్యధికంగా 40 కోట్లమంది ఉపయోగిస్తున్నారు.

గతంలోనూ...

ఇప్పటికే 'ఫైవ్​ ఐస్'​తో కలిసి దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్​లాండ్​ ఏర్పాటు చేసిన ఎస్​ఎస్​పీఏసీ కూటమిలో భారత్ 2008లోనే​ చేరింది. ఇందులో భారత నిఘా సంస్థలు ఆర్​ఏడబ్ల్యూ, ఎన్​టీఆర్​ఓ, ఏఆర్​సీ భాగంగా ఉన్నాయి. 'ఫైవ్​ ఐస్​'లో భారత్, జపాన్, దక్షిణ కొరియాను భాగం చేయాలని 2019 డిసెంబర్​లో అమెరికా ప్రతిపాదించింది.

(రచయిత- సంజీవ్​ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.