ETV Bharat / bharat

రక్షణ రంగంలో భారత్​- జపాన్​ కీలక ఒప్పందం - ప్రధాని మోదీ

రక్షణ రంగంలో భారత్​-జపాన్​ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా ఇరు దేశాల సైన్యాలు లాజిస్టిక్స్​ కోసం ఒక దాని నుంచి మరొకటి సహాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. జపాన్​ ప్రధాని షింజో అబేతో ఫోన్​లో సంభాషించారు. ఒప్పందాన్ని ఇరువురు స్వాగతించారు.

India, Japan ink deal for deeper defence cooperation
భారత్​-జపాన్​ రక్షణ లాజిస్టిక్స్​ ఒప్పందం​
author img

By

Published : Sep 10, 2020, 6:04 PM IST

భారత్​-జపాన్​ అనుబంధం గురువారం మరో మైలురాయిని చేరింది. ఎన్నో ఏళ్ల పాటు సాగిన సంప్రదింపుల అనంతరం రక్షణ రంగంలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. ఈ ఒప్పందం ద్వారా.. భారత్​-జపాన్​ సైన్యాలు లాజిస్టిక్స్​పరంగా పరస్పర సహకారం పొందవచ్చు. ఆసియాలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో ఈ కీలక ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది.

రక్షణశాఖ కార్యదర్శి అజయ్​ కుమార్​, జపాన్​ రాయబారి సుజుకి సతోషి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత బలపడుతుందని, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఒక దేశ సైనిక శిబిరాన్ని మరో దేశం వినియోగించుకోవచ్చని పేర్కొంది.

అబేకు మోదీ ఫోన్​...

ఈ నేపథ్యంలో జపాన్​ ప్రధాని షింజో అబేతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించారు. ఈ "అగ్రిమెంట్​ ఆన్​ రెసిప్రోకల్​ ప్రొవిజన్​ ఆఫ్​ సప్లైస్​ అండ్​ సర్వీసెస్​" ఒప్పందం కుదరడాన్ని ఇరువురు స్వాగతించారు. దీంతో రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం మరింత శక్తిమంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జపాన్​ అభివృద్ధిలో అబే పాత్రను ప్రశంసించారు ప్రధాని మోదీ. భారత్​-జపాన్​ మైత్రి బలపడటంలోనూ షింజో అబే నాయకత్వం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అనారోగ్య కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జపాన్​ ప్రధాని ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:- భారత్‌కు అబె... ఓ మంచి నేస్తం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.