ETV Bharat / bharat

భారతీయులు నిద్రపోవడం తగ్గించేశారట!

నిద్రలేమి.. ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమేకాక ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. కేవలం నిద్రపోయేందుకే ఓ రోజును కేటాయించారని తెలుసా! అదే 'వరల్డ్​ స్లీప్​ డే'. దీన్ని ప్రతి ఏడాది మార్చి 13న (నేడు) జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది ఓ సర్వే.

author img

By

Published : Mar 13, 2020, 4:24 PM IST

Updated : Mar 13, 2020, 10:10 PM IST

India is sleeping less
భారత్​లోనే తక్కువగా నిద్రపోతారట!

నిద్ర.. ఎన్నో సమస్యలకు మూల కారణం. ఓ వ్యక్తి అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇది ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరిగా నిద్రలేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. నేడు 'వరల్డ్​ స్లీప్ డే' సందర్భంగా నిద్రపై ఓ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు పరిశోధకులు.

ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్​లో అతి తక్కువ సమయం నిద్రపోతారట. భారత్​లోని 10 నగరాల్లో ఈ సర్వే జరిపి నిద్రపోయే సమయాలను గుర్తించారు. సాధారణంగా మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అయితే ఎవరూ సరిపడ నిద్రపోవడం లేదని వెల్లడించింది ఈ సర్వే.

25-35 ఏళ్ల వయసున్న మహిళలు వారాంతాల్లో 6 గంటల 36 నిమిషాలు నిద్ర పోతారు. మిగతా రోజుల్లో సుమారు 6:57 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. పురుషులు అయితే వారాంతాల్లో 6:33 నిమిషాలు, మిగతా రోజుల్లో 6:45 నిమిషాలు నిద్రపోతారు.

నిద్రలో వాళ్లే ఎక్కువ...

సాధారణంగా సంపన్నులు అధికంగా విశ్రాంతి తీసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ అందులో వాస్తవం లేదు. వారు వారాంతాల్లోనూ, మిగతా రోజుల్లోనూ సుమారు 6:45 నిమిషాలే నిద్రిస్తారు. ఇక మధ్యతరగతి వారైతే వారాంతాల్లో 7:27నిమిషాలు, మిగతా రోజుల్లో 6:51 నిమిషాలు పడుకుంటారు.

సరైన నిద్ర లేకపోవడానికి కారణాలు ఇవే

సరిపడా నిద్ర లేకపోవడానికి ఎలక్ట్రానిక్​ వస్తువులైన ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు, చరవాణులు ముఖ్య కారణం. అధిక సమయం వీటితో గడపడం వల్ల ఎవరూ తగిన విశ్రాంతి తీసుకోవడం లేదు. ​ఇక 15 శాతం మంది ఆర్థిక వ్యవహారాల వల్ల నిద్రపోవడం లేదు. 42 శాతం మంది నడుం నొప్పితో బాధపడుతూ పడుకోలేకపోతున్నారు. అధిక సమయం నిద్ర పోయినప్పటికీ విశ్రాంతి లేకుండా ఉంటున్నామని 22 శాతం మంది తెలిపారు. రోజులో కనీసం మూడు సార్లైనా నిద్రమత్తుగా ఉంటుందని 38 శాతం మంది చెప్పారు.

ఈ నగరాల్లో అధికం

దేశవ్యాప్తంగా నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య చెన్నైలో అధికంగా ఉంది. దీని తర్వాత స్థానాల్లో బెంగళూరు, భువనేశ్వర్​, అహ్మదాబాద్​ నిలిచాయి.

ఇదీ చదవండి: ప్రకృతి వైపరీత్యాలతో... గూడు పోయి గోడు మిగిలె!

Last Updated : Mar 13, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.