ETV Bharat / bharat

సరిహద్దులో భారత్ దేనికైనా రె'ఢీ': రాజ్​నాథ్​ - భారత్​-చైనా సరిహద్దు వివాదం

సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉందని రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. పార్లమెంట్​ వేదికగా భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చేసిన ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్​ కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే... ఎల్​ఏసీని ఏకపక్ష ధోరణితో మార్చేందుకు ప్రయత్నిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు.

India is ready to deal with any situation: Rajnath in Lok Sabha
శాంతి కావాలి.. కానీ చూస్తూ ఊరుకోం: రాజ్​నాథ్​
author img

By

Published : Sep 15, 2020, 4:39 PM IST

భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పార్లమెంట్​ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడటానికి సరిహద్దులో జవాన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని రాజ్​నాథ్​ పేర్కొన్నారు. వారికి మద్దతుగా నిలుస్తామని నేతలు లోక్​సభలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

వాస్తవాధీన రేఖను చైనా గుర్తించలేకపోతోందని తెలిపిన రాజ్​నాథ్​.. ఫలితంగా సరిహద్దు సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు.

"భారత్​-చైనా సరిహద్దు సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇప్పటివరకు ఇరు పక్షాలు ఓ పరిష్కారంపై పరస్పర అంగీకారానికి రాలేదు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సంప్రదాయ అమరికలను చైనా గుర్తించడం లేదు. కానీ వాస్తవాధీన రేఖను భారత్​ గౌరవిస్తోంది. భౌగోళికంగా అన్ని సూత్రాలను పాటించిన తర్వాతే దాన్ని ఏర్పాటు చేసినట్టు మేము విశ్వసిస్తున్నాం. అయితే సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్​-చైనా అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాం."

--- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

ప్రస్తుత ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్​ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాజ్​నాథ్​. సరిహద్దులో యథాతథ స్థితిని చైనా ఏకపక్ష ధోరణితో మార్చేందుకు ప్రయత్నిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. బీజింగ్​కు ఈ విషయాన్ని ఇప్పటికే దౌత్య మార్గాల ద్వారా తేల్చిచెప్పినట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- 'భారత్‌తో కయ్యం.. చైనా అధ్యక్షుడి సీటుకు చేటు!'

ఏప్రిల్​ నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన బలగాలను మోహరించడం మొదలు పెట్టిందని.. మే నెలలో భారత్​పైకు కయ్యాని కాలుదువ్విందని వివరించారు రాజ్​నాథ్​. ఈ క్రమంలోనే జూన్​ 15న గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటన జరిగిందన్నారు. అయితే చైనా సవాళ్లను భారత్​ సమర్థంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. చైనా దుశ్చర్యలను అడ్డుకునేందుకు.. భారత్​ కూడా సరిహద్దులో సైన్యాన్ని పెంచిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ వాకౌట్​...

రాజ్​నాథ్​ ప్రకటనపై కాంగ్రెస్​ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దు వివాదంపై చర్చకు డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

ఇదీ చూడండి:- చైనా మరో కుట్ర- ప్రముఖులపై నిఘా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.