ETV Bharat / bharat

డ్రాగన్‌పై మంచుకొండల్లో ప్రత్యేక ఆపరేషన్‌?

వాస్తవాధీన రేఖ వెంట హద్దు మీరుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సైనికపరంగా ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది భారత్​. పాంగాంగ్‌ సరస్సు వద్ద డ్రాగన్‌ బలగాలను వెనక్కి పంపేయడానికి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టే అంశంపై భారత్‌ యోచిస్తోంది.

INDIA -CHINA STANDOFF
డ్రాగన్‌పై ప్రత్యేక ఆపరేషన్‌?
author img

By

Published : Jun 23, 2020, 6:25 AM IST

వాస్తవాధీన రేఖకు అటూ ఇటూ వెయ్యి మంది చొప్పున సైనికులు మోహరించి ఉన్నారు. ఇరు పక్షాల మధ్య కొద్ది మీటర్ల దూరమే ఉంది. గతవారం రెండు దేశాల బలగాల నడుమ భీకర ఘర్షణ జరిగిన తర్వాత గల్వాన్‌ లోయలో నెలకొన్న పరిస్థితి ఇది. ఈ నేపథ్యంలో హద్దు మీరుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సైనికపరంగా ఉన్న మార్గాల గురించి భారత్‌ తీవ్రంగా యోచిస్తోంది. గల్వాన్‌లోని పెట్రోలింగ్‌ పాయింగ్‌ (పీపీ)-14 వద్ద రెండు దేశాలూ తమ బలప్రదర్శనకు దిగాయి. పాంగాంగ్‌ సరస్సు వద్ద కూడా ఇరు పక్షాలూ పోటాపోటీగా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. వీటికి మద్దతుగా కొద్దిదూరంలో శతఘ్ని దళాలు, ట్యాంకులనూ రంగంలోకి దించాయి. జూన్‌ 15 తర్వాత కొత్తగా హింస జరగలేదు. అయితే భారీ బలగాల మోహరింపు వల్ల పరిస్థితి వేడిగా ఉంది. రెండు పక్షాలకూ పరస్పరం నమ్మకం సడలిందని అధికార వర్గాలు తెలిపాయి.

సైనిక ఆపరేషన్‌?

చైనా దుందుడుకుతనం కొనసాగితే సైనికపరంగా బదులిచ్చేందుకు పలు మార్గాలను భారత్‌ పరిశీలిస్తోంది.

  1. పాంగాంగ్‌ సరస్సు వద్ద డ్రాగన్‌ బలగాలను వెనక్కి పంపేయడానికి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టే అంశంపై భారత్‌ యోచిస్తోంది. ఇటీవలి వరకూ భారత నియంత్రణలో ఉన్న 'ఫింగర్‌ 4' వద్ద చైనా బలగాలు తిష్ఠవేశాయి.
  2. వాస్తవాధీన రేఖ వెంబడి మరో ప్రాంతంలోనూ మోహరింపును చేపట్టే అంశాన్నీ భారత్‌ పరిశీలించొచ్చు. తద్వారా డ్రాగన్‌పై ఒత్తిడి పెరిగి, రాజీకి వస్తుందని, లద్దాఖ్‌ అంశంపై జరిగే చర్చల్లో ఇది భారత్‌కు సానుకూల పరిస్థితిని కలిగిస్తుందని భావిస్తోంది.

ఏమిటీ ఫింగర్లు?

పాంగాంగ్‌ సరస్సులో వేళ్లలా పొడుచుకొచ్చిన పర్వత ఆకృతులు ఉన్నాయి. వీటిని ఫింగర్లుగా పేర్కొంటారు. మొత్తం మీద ఈ సరస్సును 8 ఫింగర్లుగా విభజించారు. ఫింగర్‌ 1 నుంచి 4 మధ్య ఉన్న ప్రాంతం భారత నియంత్రణలో ఉండేది. ఆ తర్వాతి భాగం చైనా అదుపులో ఉంది. ఫింగర్‌ 8 వరకూ తమదేనన్నది భారత్‌ వాదన. ఫింగర్‌ 4 వద్ద భారత సైనిక శిబిరం ఉంది. ఇక్కడ చైనా బలగాలు మోహరించాయి. ఫింగర్‌ 4 నుంచి 8 మధ్య ఉన్న ప్రాంతంలో భారీగా తిష్ఠవేశాయి. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చే ఉద్దేశంతోనే దీన్ని చేపట్టినట్లు భారత్‌ అనుమానిస్తోంది. ఒకప్పుడు భారత బలగాల అదుపులో ఉన్న ప్రాంతంలో భారీగా చైనా సైన్యం ఉండటం వల్ల ఈ వివాదం పరిష్కారం కావడం లేదు.

మరోవైపు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల ఆధ్వర్యంలో సోమవారం చర్చలు జరిగాయి. అదే సమయంలో దిల్లీలో జరిగిన సైనిక కమాండర్ల సదస్సులో భారత మిలటరీ నాయకత్వం.. చైనా సరిహద్దుల్లోని పరిస్థితులపై సమీక్ష జరిపింది.

ఇదీ చూడండి: సుదీర్ఘంగా భారత్​-చైనా సైనికాధికారుల చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.