ETV Bharat / bharat

పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్​కు మూడోస్థానం - జాతీయ పెట్టుబడులు 2017-18 నూతన ఆవిష్కరణలు

పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో గత పదేళ్లలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. ఈ అంశంలో అమెరికా, చైనా తర్వాత మన దేశం మూడో స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ శుక్రవారం తెలిపింది.

scientific publications of india
పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్​కు మూడోస్థానం
author img

By

Published : Jan 23, 2021, 6:35 AM IST

శాస్త్రీయ ప్రచురణల విషయంలో గత పదేళ్లలో భారత్​లో గణనీయ పురోగతి చోటుచేసుకుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ శుక్రవారం తెలిపింది. ఈ అంశంలో చైనా, అమెరికా తర్వాత మన దేశం మూడో స్థానంలో ఉందని పేర్కొంది. 2018లో మన దేశం నుంచి 1,35,788 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని వివరించింది.

ఈ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

  • 2017-18లో ప్రపంచవ్యాప్తంగా లభించిన 13,045 పేటెంట్లలో 1937 పేటెంట్లు భారతీయులవే. ఈ కాలంలో మొత్తం 15,550 పేటెంట్ల కోసం భారతీయులు దరఖాస్తు చేశారు. వీటిలో 65 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ నుంచి దాఖలయ్యాయి.
  • పరిశోధన, అభివృద్ధి అంశంలో జాతీయ పెట్టుబడులు 2017-18లో రూ.1,13,825 కోట్లు ఉండగా 2018-19 నాటికి అది రూ.1,23,847 కోట్లకు పెరిగాయి.
  • నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'నిధి' వంటి కార్యక్రమాల వల్ల కూడా పరిస్థితి మెరుగుపడింది. దీనివల్ల గత ఐదేళ్లలో 65,884 ఉద్యోగాలు, ఆర్థిక సంపద రూపంలో రూ.27,262 కోట్లు లభించాయి.
  • పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో భారత వృద్ధి 12.9 శాతంగా ఉంది. ప్రపంచ సరాసరి 4.9 శాతమే. 2008-18 మధ్య కాలంలో భారత్​లో 10.7 శాతం వృద్ధి రేటు ఉంది. ఆ పదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సరాసరి వృద్ధి రేటు. ఆ కాలంలో చైనాలో ఇది 7.81 శాతంగా, అమెరికాలో 0.71 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:'సీరంలో ప్రమాదంతో ఆ టీకాల ఉత్పత్తిపై ప్రభావం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.