ETV Bharat / bharat

'స్పుత్నిక్' టీకా దిగుమతిపై రష్యాతో భారత్ చర్చలు

'స్పుత్నిక్​-వీ' వ్యాక్సిన్​ దిగుమతిపై రష్యాతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 36 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయని, అందులో భారత్​కు చెందిన రెండు టీకాలు ఉన్నాయని తెలిపింది.

russia
రష్యాతో భారత్ చర్చలు
author img

By

Published : Sep 19, 2020, 6:55 AM IST

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ దిగుమతిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్​సభలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 36 వ్యాక్సిన్లపై క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయని, అందులో భారత్​కు చెందిన రెండు వ్యాక్సిన్లు ఉన్నాయని వివరించారు చౌబే. అయితే ఏవి కూడా తుది దశ ప్రయోగాలకు చేరుకోలేదని చెప్పారు.

ప్రాథమిక స్థాయి ప్రయోగాల్లో..

మరో ప్రశ్నకు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమాధానమిస్తూ క్లినికల్ ట్రయల్స్​లో ఉన్న రెండు వ్యాక్సిన్లు కాకుండా దేశంలో మరో 30 వ్యాక్సిన్లపై ప్రాథమిక స్థాయి ప్రయోగాలు జరుగుతున్నట్లు చెప్పారు. వివిధ కంపెనీలు, విద్యాసంస్థలు వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రష్యా​ టీకా తీసుకున్న వారిలో సైడ్​ ఎఫెక్ట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.