ETV Bharat / bharat

'స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ యుద్ధం చేయదు' - Ajit Doval latest news

స్వార్థపూరిత ప్రయోజనాల కోసం భారత్​ ఎవరితోనూ యుద్ధం చేయదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. రిషికేశ్​లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

'India has never gone to war for selfish reasons'
'భారత్ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధం చేయదు'
author img

By

Published : Oct 26, 2020, 7:29 PM IST

భారత్​ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్​ఎస్​ఏ) అజిత్ డోభాల్​ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వార్థ ప్రయోజనాలు కోసం భారత్​ ఎవరితోనూ యుద్ధం చేయదని స్పష్టం చేశారు. రిషికేశ్​లోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైన పర్మాత్​ నికేతన్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపన్యాసించారు అజిత్​. ఈ నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర, స్వామి వివేకానంద ఫిలాసఫీని గుర్తు చేసుకున్నారు.

'స్వార్థపూరిత కారణాల వల్ల భారత్ ఎవరితోనూ యుద్ధం చేయలేదు. దేశ రక్షణకు ముప్పు వాటిల్లినప్పడే రంగంలోకి దిగుతుంది' అని ఓ ఔత్సాహికుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు డోభాల్​. ఈ నేపథ్యంలో భారతీయ నాగరికత శాంతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఆధ్యాత్మిక గురువులను కోరారు. సామూహిక గుర్తింపును కాపాడటమే భారతీయ గురువులు, ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర అని అన్నారు.

'దేశం భావోద్వేగ బంధం. ఇది ఆధ్యాత్మికత, సంస్కృతి వల్ల ఏర్పడింది. ఇది సామూహిక భావన' అని డోభాల్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: దిల్లీలో అమెరికా-భారత రక్షణ మంత్రుల భేటీ

For All Latest Updates

TAGGED:

Ajit Doval
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.