ETV Bharat / bharat

అలా జరిగితే సైనిక చర్యే: చైనాకు రావత్ హెచ్చరిక - border standoff news

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​. చర్చలు విఫలమైతే.. చైనా అతిక్రమణలను సైనిక చర్యలతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

CDS Rawat
చైనాకు సీడిఎస్​ బిపిన్​ రావత్​ గట్టి హెచ్చరిక
author img

By

Published : Aug 24, 2020, 11:48 AM IST

చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు జరుగుతోన్న చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వటం లేదు. ఈ క్రమంలో డ్రాగన్​కు గట్టి హెచ్చరికలు పంపారు త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్​. ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయి చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుంటే.. చైనా అతిక్రమణలను సైనిక చర్యలతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

లద్ధాఖ్​లో చైనా అతిక్రమణలను సైనిక చర్యతో ఎదుర్కొనేందుకు సిద్ధం. కానీ, దౌత్య, సైనిక స్థాయి చర్చలు విఫలమైన పక్షంలోనే అలా జరుగుతుంది.

- జనరల్​ బిపిన్​ రావత్​, త్రిదళాధిపతి

లద్ధాఖ్​ సెక్టార్​ నుంచి చైనా సైన్యాన్ని వెనక్కి పంపేందుకు భారత్​ ఎలాంటి సైనిక సన్నాహాలు చేస్తోందో అని వివరించేందుకు నిరాకరించారు రావత్​.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో కొన్ని ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించినా.. ఫింగర్​ ఏరియాల నుంచి ఉపసంహరించేందుకు నిరాకరిస్తోంది చైనా. సరిహద్దుల నుంచి సైన్యం ఉపసంహరణను ఆలస్యం చేసేందుకు జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఫింగర్​-4 ప్రాంతం నుంచి సమాన దూరంలో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా చేసిన ప్రతిపాదనను భారత్​ తిరస్కరించింది.

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణపై చైనా ప్రతిపాదనకు భారత్​ నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.