ETV Bharat / bharat

కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లకు భారత్​ చెక్​!

author img

By

Published : Aug 3, 2020, 9:32 AM IST

చైనా అధికార విస్తరణ కాంక్షను దెబ్బకొట్టేందుకు భారత్​ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. చైనాకు కీలకమైన కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లలను లక్ష్యంగా చేసుకుంటోంది. దేశంలో వాటి స్థాపనను అడ్డుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లకు అనుమతులు నిరాకరించాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

India has decided to deny permits to Chines Confucius Institutes
కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లకు భారత్​ చెక్​!

వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి బలగాలను వెనక్కి తీసుకోకుండా కాలయాపన చేస్తున్న చైనా అధికార విస్తరణ కాంక్షపై దెబ్బకొట్టడానికి భారత్​ సమాయత్తమవుతోంది. ఆ దిశగా పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చైనాకు కీలకమైన కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్​లను లక్ష్యంగా చేసుకుంటోంది. దేశంలో వాటి స్థాపనను అడ్డుకోవాలని యోచిస్తోంది.

అంతర్జాతీయ చైనీష్​ భాషా మండలి ఆధ్వర్యంలో కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లు పని చేస్తాయి. విదేశాల్లో చైనీస్​ భాష, సంస్కృతికి విస్తృత ప్రచారం కల్పించడం ఈ ఇన్​స్టిట్యూట్ల ప్రధాన విధి. ఇందుకోసం ఆయా దేశాల్లో స్థానిక విద్యాసంస్థలతో కలిసి పని చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లు ఉండగా.. అందులో 100కు పైగా ఒక్క అమెరికాలోనే ఉన్నాయి.

అయితే, ఆయా దేశాలపై తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు వాటిని చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లో చైనా విస్తరణ కాంక్షకు అడ్డుకట్ట వేసేలా.. కన్​ఫ్యూషియస్​ ఇన్​స్టిట్యూట్లకు అనుమతులు నిరాకరించాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.