భారత్, శ్రీలంక మధ్య బంధం వేల ఏళ్ల నాటిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన శ్రీలంక ప్రధాని రాజపక్సకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారత్, శ్రీలంక వర్చువల్ ద్వైపాకిక్ష సదస్సులో భాగంగా.. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో సమావేశమయ్యారు మోదీ.
ఈ సందర్భంగా కరోనా సమయంలో ఇతర దేశాల కోసం భారత్ చేసిన కృషిని రాజపక్స ప్రశంసించారు. ఇటీవల శ్రీలంక సమీపంలో న్యూడైమండ్ నౌక అగ్ని ప్రమాదం సమయంలో ఇరు దేశాల సహకారం అమోఘమని పేర్కొన్నారు.