ETV Bharat / bharat

రైతులకు ఊరట.. పోర్టుల్లోని ఉల్లి ఎగుమతులకు ఓకే! - పోర్టుల్లోని ఉల్లి ఎగుమతులకు ఓకే

ఉల్లి రైతులకు ఊరటనిచ్చింది కేంద్రం. నౌకాశ్రయాల్లో ఉన్న ఉల్లిపాయలను ఎగుమతి చేసేందుకు అనుమతిచ్చింది. వాటిని బంగ్లాదేశ్​​​తో పాటు అన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకారం చెప్పినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

onion crop
పోర్టుల్లోని ఉల్లి ఎగుమతులకు ఓకే!
author img

By

Published : Sep 19, 2020, 10:11 PM IST

Updated : Sep 19, 2020, 10:36 PM IST

దేశంలోని ఉల్లిరైతులకు స్వల్ప ఊరట కలిగించింది కేంద్రం. నౌకాశ్రయాల్లో ఉన్న ఉల్లిపాయలను బంగ్లాదేశ్​​తో పాటు అన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది. ధరలను నియంత్రించేందుకు ఉల్లిపాయల ఎగుమతిపై ఈనెల 14న నిషేధం విధించింది భారత ప్రభుత్వం.

కోల్​కతా జోన్​ పోర్టులో 20,089 మెట్రిక్​ టన్నులు, ముంబయి-2 జోన్​లో 4,576 మెట్రిక్​ టన్నులు, తిరుచి, నాగ్​పుర్​లలో 933, 258 మెట్రిక్​ టన్నుల ఉల్లిపాయలు ఎగుమతులకు సిద్ధంగా ఉన్నాయి.

ఉల్లి ఎగుమతులపై భారత్​ నిషేధం విధించటంపై బంగ్లాదేశ్​​ ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో.. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్​లో ఉల్లిపై నిషేధం విధించిన క్రమంలో బంగ్లాదేశ్​​ ప్రధాని షేక్​ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్​ నిర్ణయంతో తమ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో నిషేధం ఎత్తివేసింది భారత్​.

ఇబ్బందుల్లో రైతులు...

ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించటం వల్ల దేశీయ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు భారీగా పతనమై తీవ్ర నష్టం ఏర్పడుతోందని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సత్వరమే నిషేధం ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు.

కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఉల్లిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిత్రదుర్గకు చెందిన ఓ రైతు 8 లక్షలు ఖర్చు చేసి 10 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. అతని కుటుంబం కరోనా బారిన పడటానికి తోడు భారీ వర్షాలతో పంట మొత్తం నాశనమైంది. చేసేదేమి లేక.. ట్రాక్టర్​తో పంటమొత్తాన్ని దున్నేశాడు రైతు బసవరాజు.

పోర్టుల్లోని ఉల్లి ఎగుమతులకు ఓకే!

పాడవుతోన్న ఉల్లి...

ఉల్లి ఎగుమతులపై నిషేధంతో రైతులు పంటను తమ ఇంటిలో నిలువ చేసుకున్నారు. కర్ణాటక కలబురిగికి చెందిన ఓ రైతు.. తన ఉల్లి పంటను నిలువ చేయగా.. వర్షాల కారణంగా అవి పాడయ్యాయి. పూర్తిగా పంట నాశనం కాకముందే ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

onion crop
పాడైన ఉల్లిని చూపిస్తున్న రైతు
onion crop
ఇంట్లో నిలువ చేసిన ఉల్లి

ఇదీ చూడండి: ఉల్లి ఎగుమతుల నిషేధంపై రైతులు ఆగ్రహం

Last Updated : Sep 19, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.