ETV Bharat / bharat

'కరోనా తీవ్రతలో ఆసియాలోనే అగ్రస్థానాన భారత్​'

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో 30 శాతం భారత్​లోనే నమోదవుతున్నట్లు ఐపీహెచ్​ఏ నిపుణుల టాస్క్​పోర్స్​ నివేదించింది. కరోనా తీవ్రతలో ఆసియాలోనే భారత్​ మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేసింది.

COVID-19
కరోనా తీవ్రత
author img

By

Published : Sep 1, 2020, 1:41 PM IST

ఆసియాలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్​ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో 30 శాతం, మరణాల్లో 20 శాతం భారత్​లోనే నమోదవుతున్నాయని భారత ప్రజారోగ్య సంఘం (ఐపీహెచ్​ఏ) నిపుణులు వెల్లడించారు.

'భారత్​లో కొవిడ్​-19'పై మూడో సంయుక్త ప్రకటన చేసింది ఐపీహెచ్​ఏ టాస్క్​ఫోర్స్​ బృందం. అయితే, దేశంలో కరోనా సంక్షోభం తారస్థాయికి చేరుకోలేదని తెలిపింది. దేశంలో ఆగస్టు 16 నాటికి కరోనా నుంచి 23 లక్షల (ప్రస్తుతం 28 లక్షలు) మంది కోలుకున్నారని, మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోందని వివరించింది.

"దేశంలో ఆగస్టు 16 నాటికి 7 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. పునరుత్పత్తి రేటు 1.06గా ఉంది. అంటే, దేశంలో కరోనా విపత్తు తారస్థాయికి చేరుకోలేదు. అయితే, కరోనా మహమ్మారి ప్రతిస్పందనకు పూర్తి ఆరోగ్య వ్యవస్థను వినియోగించటం వల్ల ఇతర జాతీయ వైద్య కార్యక్రమాలపై పరిమితమైన దృష్టి సారించారు."

- టాస్క్​ఫోర్స్ నివేదిక

దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. చాలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి మొదలైనట్లు సెరో సర్వేలు బయటపెట్టినట్లు వివరించింది. వీటి ప్రకారం.. అంచనా వేసిన కేసుల్లో 5 శాతమే గుర్తించగలుగుతున్నామని తెలిపింది.

అన్​లాక్​ నుంచి..

భారత్​లో అన్​లాక్​ ప్రక్రియ మొదలైన నాటి నుంచి రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూన్​ 5న 9 వేల కేసులు నమోదు కాగా, ఆగస్టు 23 నాటికి ఈ సంఖ్య 61 వేలకు చేరింది. ప్రతి 10 లక్షల మందిలో 2,251 మందికి వైరస్​ సోకింది.

టాస్క్​ఫోర్స్..

భారత్​లోని ప్రముఖ ప్రజారోగ్య నిపుణుల సంయుక్త టాస్క్​పోర్స్​ను 2020 ఏప్రిల్​లో నియమించింది ఐపీహెచ్​ఏ. మహమ్మారిపై కేంద్రానికి సలహాలు ఇచ్చేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్​ఎం) ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 69,921 కేసులు.. 819 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.