దేశంలోనే తొలి నాచు(మోస్) గార్డెన్‌ను నైనిటాల్ జిల్లాలో ఏర్పాటు చేసింది ఉత్తరాఖండ్ అటవీశాఖ. లింగాధర్ గ్రామంలో ఒకటిన్నర హెక్టారుకుపైగా ప్రాంతంలో.. వివిధ రకాల జాతుల నాచుతో ఈ గార్డెన్‌ను నిర్మించింది.
"నవంబర్ 20న ఈ మోస్ గార్డెన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాం. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేథ్యంలో గార్డెన్‌ను మూసివేశాం. పరిస్థితి మెరుగుపడ్డాక గార్డెన్‌ను మళ్లీ తెరుస్తాం."
--- నితిన్ పంత్, అటవీశాఖ అధికారి.
వివిధ జాతుల నాచులను పరిరక్షించే లక్ష్యంతోనే ఈ గార్డెన్‌ను నిర్మించినట్టు నితిన్ వెల్లడించారు. పర్యావరణంపై మోస్ ప్రాముఖ్యతను వివరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.