ETV Bharat / bharat

మోదీ సర్కారుకు మన్మోహన్​ మూడు సూత్రాలు - మోదీ సర్కారుకు మన్మోహన్​ మూడు సూత్రాలు

సమాజంలో అశాంతి, ఆర్థిక మందగమనం, కరోనా మహమ్మారి అనే మూడు సమస్యల నుంచి భారత్​ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారుకు మూడు సూచనలిచ్చారు.

India faces 'danger' from social disharmony, slowdown, global health epidemic: Manmohan
మోదీ సర్కారుకు మన్మోహన్​ మూడు సూత్రాలు
author img

By

Published : Mar 7, 2020, 5:40 AM IST

Updated : Mar 7, 2020, 6:42 PM IST

మోదీ సర్కారుకు మన్మోహన్​ మూడు సూత్రాలు

ప్రస్తుతం భారత్‌ ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కొవిడ్-19 (కరోనా) వైరస్‌ అనే మూడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ప్రముఖ ఆంగ్ల పత్రికకు రాసిన కథనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత సమస్యలు ఆర్థిక, ప్రజాస్వామ్య పరంగా అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న గుర్తింపును తగ్గిస్తాయని తెలిపారు. రాజకీయ వర్గాలతో సహా సమాజంలోని కొంతమంది మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యారని దిల్లీ అల్లర్లను ఉద్దేశించి అన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించి న్యాయం జరిగేట్టు చూడటంలో శాంతిభద్రతలను కాపాడవలసిన సంస్థలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ విషయంలో మీడియా కూడా వైఫల్యం చెందిందని అన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చోటుచేసుకొంటున్నాయని, ఈ పరిస్థితులకు కారణమైన వారే వాటిని ఆపగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్థికం దిగజారింది...

ఉదార ప్రజాస్వామ్య పద్ధతుల వల్ల కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలో భారత్ అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి నమూనా స్థాయి నుంచి దిగజారిపోయిందని తెలిపారు. ఆర్థికాభివృద్ధికి పునాదిలాంటి సామాజిక సామరస్యం ప్రమాదంలో ఉన్నప్పుడు పన్ను రేట్ల తగ్గింపు, కార్పొరేట్‌ రాయితీలు, విదేశీ పెట్టుబడులు వంటివి ఎటువంటి సహాయం చేయలేవని అన్నారు.

కరోనాను అడ్డుకోవాలి...

భారత్‌లో కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వ్యాపించకుండా అరికట్టేందుకు వేగంగా స్పందించి, ఇతర దేశాల నుంచి మనం అవలంబించగలిగే పద్దతులను అధ్యయనం చేయాలని సూచించారు. మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత ప్రభావం చూపకముందే చర్యలకు ఉపక్రమించాలని కోరారు.

మూడు సూచనలు...

చివరగా దేశంలో నెలకొన్న పరిరస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వానికి ఆయన మూడు సూచనలు చేశారు.

మొదటగా మనకున్న అన్ని వనరులను ఉపయోగించి కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ఉపసంహరించాలి లేదా దానిలో మార్పులు చేయడం ద్వారా దేశంలో నెలకొన్న సామాజిక అస్థిరతను తగ్గించి ఐకమత్యాన్ని పెంచొచ్చన్నారు.

ప్రమాదంలో ఉన్న ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దేందుకు మంచి ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

Last Updated : Mar 7, 2020, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.