దేశంలో గడచిన 24 గంటల్లో 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

కరోనా కేసుల్లో భారత్... చైనాను దాటిపోయింది. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే... 85,970 పాజిటివ్ కేసులతో భారత్ 11వ స్థానంలో ఉండగా.. 82,941 కేసులతో చైనా 13వ స్థానంలో ఉంది. కరోనా మరణాల విషయానికి వస్తే భారత్‌లో 2,753 మంది మహమ్మారి బారినపడి మరణిస్తే... చైనాలో 4,633 మంది మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా...
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకారం, గడచిన 24 గంటల్లో... మహారాష్ట్రలో- 49, గుజరాత్- 20, బంగాల్- 10, దిల్లీ- 8, ఉత్తర్‌ప్రదేశ్- 7, తమిళనాడు- 5, మధ్యప్రదేశ్- 2, కర్ణాటక- 1, హిమాచల్‌ప్రదేశ్- 1 చొప్పున మరణించారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్ జీవ ఆయుధంగా మారితే!