ETV Bharat / bharat

తమిళనాడుపై కరోనా పంజా- మరో 5,980 మందికి వైరస్​ - Corona pandemic in India

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో కొత్తగా మరో 5,980 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. 120 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA UPDATES IN INDIA
తమిళనాడుపై కరోనా పంజా.. మరో 5,980 మందికి వైరస్​
author img

By

Published : Aug 17, 2020, 7:27 PM IST

భారత్​లో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఆందోళనకర స్థాయిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాట తాజాగా 5,980 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,43,945కు చేరింది. మరో 120 మరణాలతో... మృతుల సంఖ్య 5,886కు పెరిగింది. అయితే.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2,83,937 మందికి వైరస్​ నయమవ్వగా.. 54,122 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రరూపం..

యూపీలో కొత్తగా 4,186 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 69 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,515కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,04,808 మందికి వైరస్​ నయమైంది.

ఒడిశాలో..

ఒడిశాలో తాజాగా 2,224 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 62,294కు ఎగబాకింది. మరో 10 మంది వైరస్​కు బలవ్వగా.. మరణాల సంఖ్య 353కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 42,277 మంది వైరస్​ను జయించి డిశ్చార్జ్​ అయ్యారు. 19,611 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.

రాజస్థాన్​లో..

రాజస్థాన్​లో తాజాగా మరో 693 మందికి కొవిడ్​గా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 61,989కి చేరింది. మహమ్మారి కారణంగా మరో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరణాల సంఖ్య 886కు ఎగబాకింది.

కేరళలో..

కేరళలో కొత్తగా 1,725 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 46 వేలు దాటింది. అయితే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో సుమారు 30 వేలమందికి పైగా కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంకొత్త కేసులుమొత్తం బాధితులు
అరుణాచల్​ ప్రదేశ్​432,701
సిక్కిం191,167
మణిపుర్​​1184,687
జమ్ముకశ్మీర్​42228,892

ఇదీ చదవండి: కరోనా కష్టాలు: వర్షంలో సైకిల్​పై అంతిమయాత్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.