ETV Bharat / bharat

మరో నెలలో అమెరికాను దాటనున్న భారత్​! - భారతదేశంలో కరోనా వైరస్

దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే అక్టోబర్​ మొదటి వారంలో కేసుల సంఖ్యలో అమెరికాను దాటేస్తుందని హైదరాబాద్​లోని బిట్స్​ పిలానీ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 65 లక్షల కేసులు ఉన్నాయి. భారత్‌లో 45.62 లక్షలు దాటాయి. ఈ సంఖ్య అక్టోబర్‌ నాటికి 70 లక్షలు దాటే అవకాశం ఉందని తెలిపింది.

corona us india
భారత్​
author img

By

Published : Sep 11, 2020, 5:36 PM IST

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నిర్ధరణ అయిన దేశాల జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉంది. భారత్‌ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ప్రస్తుత వ్యాప్తి ఇలాగే కొనసాగితే అక్టోబర్‌ మొదటి వారంలో అగ్రరాజ్యాన్ని సైతం భారత్‌ వెనక్కి నెట్టవేయనుందని హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ బిట్స్‌ పిలానీ అంచనా వేసింది.

అంటే మరో నెల రోజుల వ్యవధిలో కొవిడ్‌ కేసుల సంఖ్యలో అమెరికాను భారత్‌ దాటివేయనుంది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 65 లక్షల కేసులు ఉన్నాయి. భారత్‌లో 45.62 లక్షలు దాటాయి. ఈ సంఖ్య అక్టోబర్‌ నాటికి 70 లక్షలు దాటే అవకాశం ఉందని తెలిపింది.

మరింత మెరుగ్గా..

'అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌' విధానాన్ని ఉపయోగించి కొవిడ్‌ కేసుల సంఖ్యను అంచనా వేశారు. ఈ విషయాన్ని అధ్యయనానికి నేతృత్వం వహించిన అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌ విభాగానికి చెందిన పరిశోధకురాలు డాక్టర్‌ టీఎస్​ఎల్​ రాధిక తెలిపారు. తమ పరిశీలనలను 'ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌'కు పంపినట్లు పేర్కొన్నారు.

అయితే, కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్యపైనా కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీర్ఘకాలంలో కేసుల సంఖ్యను అంచనా వేసేందుకు మరింత మెరుగైన విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 96,551 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.