ETV Bharat / bharat

'నీతులు మాని.. సిక్కులపై దాడి చేసిన వారిని శిక్షించండి'

పాకిస్థాన్​లోని పెషావర్​లో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సిక్కులే లక్ష్యంగా పాక్​లో జరుగుతోన్న విధ్వంసకాండను భారత్ తీవ్రంగా​ ఖండించింది. పాక్​ ఇప్పటికైనా అసత్యాలు పలకడం మానేసి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

India condemns 'targeted killing' of Sikh community member in Pakistan's Peshawar
'నీతులు మాని.. సిక్కులపై దాడి చేసిన వారిని శిక్షించండి'
author img

By

Published : Jan 5, 2020, 8:11 PM IST

పాకిస్థాన్​లో సిక్కులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. పవిత్ర నన్​కానా సాహిబ్​ గురుద్వారాపై దాడిని మరువకముందే పెషావర్​లో ఓ సిక్కు యువకుడిని కొంతమంది దుండగులు హతమార్చారు. సిక్కులపై పాకిస్థాన్​లో జరుగుతోన్న విధ్వంసాన్ని భారత్​ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ అసత్యాలు పలకడం మానేసి నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్​ చేయాలని భారత్​ డిమాండ్​ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

పెషావర్​లో సిక్కు యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చడాన్ని భారత్​ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటీవల నన్​కానా సాహిబ్​ గురుద్వారాపై జరిగిన దాడి, బలవంతంగా ఓ సిక్కు అమ్మాయికి మత మార్పిడి చేసి వివాహం చేసుకున్న ఘటనలపై పాక్​ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

- భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

పాకిస్థాన్​ ప్రభుత్వం ఇతర దేశాలకు ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి.. సొంత మైనారిటీల రక్షణ కోసం పనిచేయాలని ఎమ్​ఈఏ పేర్కొంది. ఇటీవల పాక్​లోని నన్​కానా సాహిబ్ గురుద్వారా​ వద్ద జరిగిన విధ్వంసాన్ని భారత్​ తీవ్రంగా ఖండించింది. అక్కడి సిక్కు ప్రజల భద్రతకై తక్షణ చర్యలు తీసుకోవాలని పొరుగుదేశాన్ని డిమాండ్​ చేసింది భారత్​.

ఇదీ చూడండి:అలర్ట్​: యూపీలో చొరబడిన ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు!

New Delhi, Jan 04 (ANI): While speaking to ANI in an exclusive interview on January 04, the veteran Congress leader and former union minister P Chidambaram spoke on Citizenship Amendment Act (CAA) protests. He said, "We aren't provoking anti-CAA protests, we are staging anti-CAA protests and we are proud of it. Why are they calling us provocateurs?" "We are propagating our point of view and if students, youth, women are supporting our point of view and coming out on streets what's wrong with it," he added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.