ETV Bharat / bharat

అలర్ట్​: యూపీలో చొరబడిన ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు!

ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు ఉత్తర్​ప్రదేశ్​లోకి చొరబడ్డారు. వీరు ప్రస్తుతం నేపాల్​ పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు నిఘా సమాచారముందని పోలీసులు వెల్లడించారు. అందుకే ఈ ముష్కరులు తప్పించుకోకుండా భారత్​-నేపాల్​ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Alert along India-Nepal border after inputs of terrorists' presence in UP
అలర్ట్​: యూపీలో చొరబడిన ఇద్దరు ఐసీస్​ ఉగ్రవాదులు!
author img

By

Published : Jan 5, 2020, 4:36 PM IST

Updated : Jan 5, 2020, 4:42 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోకి ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు చొరబడినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లు నేపాల్​ పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు నిఘావర్గాల సమాచారం ఉందని తెలిపారు. ముష్కరులు తప్పించుకోకుండా భారత్​-నేపాల్​ సరిహద్దుల్లోని మహారాజ్​గంజ్​, కుశినగర్​, సిద్ధార్థ్​ నగర్​ల్లో హై అలర్ట్​ ప్రకటించినట్లు స్పష్టం చేశారు.

"ఇద్దరు వాంటెడ్​ ఐసిస్ ఉగ్రవాదులు అబ్దుల్​ సమద్​, ఇలియాస్​లు ఉత్తర్​ప్రదేశ్​లో చొరబడ్డారు. ఇక్కడ నుంచి వారు నేపాల్​ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం."- అశుతోష్​ కుమార్​, ఐజీ (బస్తీ రేంజ్​)

ఈ ఇద్దరు వాంటెడ్ ఉగ్రవాదులను గుర్తించేందుకుగాను వారిద్దరి చిత్రాలను భారత్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతాల్లో విరివిగా పంపిణీ చేసినట్లు ఐజీ అశుతోష్​ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ముష్కరులు ఎలాంటి దుస్తులు, వేషధారణలో ఉన్నారనే సమాచారం లేదని ఐజీ తెలిపారు.

బంగాల్​లో

ఇంతకుముందు ఈ ఇద్దరు ముష్కరులను బంగాల్​ సిలిగురిలో గుర్తించారు. పోలీసులు ఈ ఇద్దరినీ ఐసిస్​కు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.

భారత్​-నేపాల్​ల మధ్య 1,751 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. దీనిలో ఉత్తర్​ప్రదేశ్​ 599.3 కి.మీ సరిహద్దు కలిగి ఉంది. లిపిభిత్​, లఖింపుర్​ ఖేరీ, బహ్రాయిచ్​, శ్రావస్తి, సిద్ధార్థ్​నగర్​, మహారాజ్​గంజ్​ జిల్లాలు నేపాల్​తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఉగ్రవాదులను భారత్​లోకి పంపించడానికిగాను ఈ ప్రాంతాన్ని గతంలో పాకిస్థాన్ వినియోగించుకుంది. అయితే భారత్​ సరిహద్దు దళాలు పలువురు పాక్​ ఉగ్రవాదులను చాలాసార్లు పట్టుకున్నాయి.

ఇదీ చూడండి: సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: షా

Mumbai, Jan 05 (ANI): Bollywood celebrities attended special screening of 'Bombshell' in Mumbai. Actors Dia Mirza and Kiara Advani were seen during the screening. Farhan Akhtar along with her girlfriend and sister Zoya Akhtar were also present. Actor Ishaan Khattar was also reached to attend the screening.

Last Updated : Jan 5, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.