ETV Bharat / bharat

చైనాకు భారత్ ధనా'ధన్' సమాధానం - భారత్ చైనా యుద్ధం

తూర్పు లద్దాఖ్​లో ధన్​సింగ్ థాపా శిబిరం నుంచి వెనక్కు తగ్గేది లేదని చైనాకు భారత్ తేల్చిచెప్పింది. అది తమ భూభాగంలోనే ఉందని, దాన్ని ఖాళీ చేయటం కుదరదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతం నుంచి భారత్ వెనక్కు మళ్లితేనే ఫింగర్​-8 వరకు తాము బలగాలను ఉపసంహరించుకుంటామని చైనా చెబుతోంది. ఫలితంగా ఈ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

India china
భారత్ చైనా
author img

By

Published : Aug 7, 2020, 9:33 AM IST

తూర్పు లద్దాఖ్‌లో ఒప్పందం మేరకు తన బలగాలను ఉపసంహరించకుండా మడత పేచీలు పెడుతున్న చైనాకు భారత్‌ ఘాటుగా సమాధానమిచ్చింది. చైనా డిమాండ్‌ చేసినట్లు పాంగాంగ్‌ సరస్సు వద్ద తాము మరింత వెనక్కి మళ్లేది లేదని తేల్చి చెప్పింది. ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన ఐదో విడత చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

తాము తదుపరి ఉపసంహరణలు చేపట్టాలంటే భారత్‌ కీలకమైన ఒక శిబిరాన్ని ఖాళీ చేయాలని డ్రాగన్‌ డిమాండ్‌ చేసింది. అది ధన్‌సింగ్‌ థాపా శిబిరం. పాంగాంగ్‌ ప్రాంతంలో ఫింగర్‌-3 వద్ద ఉంది. ఈ శిబిరాన్ని తొలగిస్తేనే ఫింగర్‌-8 వరకూ తాము వెనక్కి మళ్లుతామని చైనా చెప్పింది. దీన్ని భారత్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ధన్‌సింగ్‌ థాపా శిబిరం తమ భూభాగంలోనే ఉందని, దాన్ని ఖాళీ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఫలితంగా ఈ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

చైనా సైన్యం ప్రస్తుతం ఫింగర్‌-4 వద్ద తిష్ఠవేసింది. అక్కడి నుంచి ఫింగర్‌-8 వరకూ ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఫింగర్‌-8 ప్రాంతం గుండానే వాస్తవాధీన రేఖ వెళుతోందని మన దేశం వాదిస్తోంది. ఈ ప్రాంతంతోపాటు దెప్సాంగ్, గోగ్రా వద్ద నుంచి చైనా తన బలగాలను ఇంకా వెనక్కి తీసుకోలేదు.

డ్రాగన్‌పై నిఘాకు ప్రత్యేక ఉపగ్రహాలు

4వేల కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను తెలుసుకునేందుకు ఉపగ్రహాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. డ్రాగన్‌పై పూర్తి స్థాయి నిఘాకు కనీసం 4-6 ఉపగ్రహాలు అవసరమవుతాయని అంచనావేస్తోంది. చైనా 40 వేల మంది సైనికులు, ఆయుధాలను మోహరించిన నేపథ్యంలో ఈ యోచన చేస్తోంది.

సైన్యాధిపతి పర్యటన

మరోవైపు చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె గురువారం అసోంలోని తేజ్‌పుర్‌లో ఉన్న సైన్యంలోని 4వ కోర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. చైనా సరిహద్దు వెంబడి బలగాలు, ఆయుధ మోహరింపుపై సీనియర్‌ సైనిక ఉన్నతాధికారులతో సమీక్షించారు. సరిహద్దుల్లోని అరుణాచల్‌ సెక్టార్‌ రక్షణ బాధ్యతను 4వ కోర్‌ చేపడుతోంది.

వెనక్కు తగ్గాల్సిందే..

తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గింపుపై చైనా తమతో కలిసి ‘నిబద్ధత’తో పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఉన్నతస్థాయిలో నిర్ణయించిన విధంగా భారత్‌ ఈ లక్ష్యానికి కట్టుబడి ఉందన్నారు.

ఇదీ చూడండి: 'చైనా అతిక్రమణ'లపై రక్షణ శాఖ తడబాటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.