ETV Bharat / bharat

మరో దఫా చర్చలకు భారత్​- చైనా సన్నద్ధం

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​-చైనా మధ్య ఈ నెల 12న కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. బలగాల ఉపసంహరణతో పాటు ఉద్రిక్తతలను తగ్గించడంపై అధికారులు సమాలోచనలు చేయనున్నారు.

author img

By

Published : Oct 4, 2020, 3:28 PM IST

India, China to hold Corps Commander-level talks
మరో దఫా చర్చలకు భారత్​-చైనా సన్నద్ధం

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భారత్‌-చైనా మధ్య మరోసారి సైనిక అధికారుల స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ నెల 12న కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి అధికారులు భేటీ కానున్నారు. బలగాల ఉపసంహరణ సహా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడంపై సమాలోచనలు జరపనున్నారు.

భారత్‌, చైనా మధ్య కార్ప్స్‌ కమాండర్‌ స్థాయిలో ఇప్పటికి ఆరుసార్లు చర్చలు జరిగాయి.

ఈ ఏడాది మే నెల నుంచి భారత్​పై కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్​ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ తర్వాత జరిగిన చర్చలతో పరిస్థితి కాస్త చక్కబడినప్పటికీ.. ఆగస్టు చివరి వారంలో సరిహద్దులో మరోమారు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది చైనా. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య బంధం మరింత బలహీనపడింది.

ఇదీ చూడండి:- 'చైనా అసలు లక్ష్యం అరుణాచల్​.. పావుగా పనికొస్తున్న లద్దాఖ్​​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.