ETV Bharat / bharat

చైనా కొత్త కుట్ర- అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు నో!

భారత్​తో శాంతి చర్చల్లో చైనా మొండి వైఖరి ప్రదర్శిస్తోందా? బలగాల ఉపసంహరణ విషయంలో ఏకపక్ష ధోరణి అవలంబిస్తోందా? భారత్​ ఎంత వారించినా.. ఫింగర్​ 5 ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లేందుకు నిరాకరిస్తుందా? ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అందుకే బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు సాగడంలేదని చెబుతున్నాయి.

india vs china news
భారత్​-చైనా బలగాల ఉపసంహరణకు కుదరని సయోధ్య..?
author img

By

Published : Jul 17, 2020, 5:58 PM IST

Updated : Jul 17, 2020, 6:29 PM IST

మే 5... భారత్​-చైనా బలగాల మధ్య తొలి బాహాబాహీ జరిగిన రోజు. 70 రోజులు దాటాయి. మధ్యలో ఎన్నోసార్లు ఉద్రిక్తతలు, మాటల తూటాలు, శాంతి చర్చలు. అయినా ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. బలగాల ఉపసంహరణపై దఫదఫాలుగా చర్చలు జరుగుతున్నా... పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఫింగర్​ 5 నుంచి ఇక వెనక్కి వెళ్లేందుకు చైనా దళాలు అంగీకరించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా తూర్పు లద్దాఖ్​లోని 134 కిలోమీటర్ల పొడవైన ఉప్పు నీటి సరస్సుకు దక్షిణాన ఉన్నారు. 13,800 అడుగుల ఎత్తైన ప్రాంతంలో వారు మొహరించి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తొలి దశ చర్చల్లో...

తొలి దశ చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 5 వరకు మాత్రమే చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. రెండో దశ చర్చలు జరిగినప్పటికీ అక్కడ నుంచి కదలట్లేదు. ఈ విషయంపై ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఓ అధికారి.. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి కదలమని చైనా చెప్పడం చర్చల ప్రక్రియను బలహీనపరచడమేనని భారత్​ భావిస్తోంది.

జూన్​ 15న గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి, ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో పరస్పరం విశ్వాసం ఏర్పడటానికి కొంత సమయం పడుతుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. అందువల్ల వేగంగా బలగాలను ఉపసంహరించుకోవడం కష్టమని... సైనిక స్థాయిలో మరిన్ని చర్చలు అవసరమని వివరించారు.

ఫలితం రావట్లే..!

ఈ నెల 6 నుంచి ఉన్నతస్థాయి చర్చలు జరిగినా పాంగాంగ్​ అంశంపై ఎలాంటి ఆశాజనక ఫలితాలు రాలేదు. జూలై 14న(మంగళవారం) ఇరు దేశాల సైనిక కోర్‌ కమాండర్ల మధ్య ఏకబిగిన 15 గంటల పాటు చర్చలు జరిగాయి. ఇందులో భారత్​ నుంచి లెఫ్టినెంట్​ జనరల్​ హరీందర్​ సింగ్​(లేహ్​లో ఉన్న 14 కార్ప్స్​ కమాండర్​), మేజర్​ జనరల్ లిన్​ లూ(జిన్​జియాంగ్​లోని చైనా దళానికి కమాండర్​) పాల్గొన్నారు. జూన్​ 6, జూన్​ 22, జూన్​ 30, జులై 14న ఈ భేటీలు జరిగాయి.

తూర్పు లద్దాఖ్‌లో యథాపూర్వ స్థితి నెలకొనాల్సిందేనని ఈ చర్చల్లో భారత్‌ డిమాండ్‌ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సరిహద్దు నిర్వహణపై ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా పాటించాల్సిందేనని పేర్కొన్నాయి. తదుపరి దశ ఉపసంహరణకు కొన్ని విధివిధానాలను రూపొందించడానికి రెండు దేశాలూ అంగీకరించినట్లు తెలిపాయి. ఐదో విడత చర్చలు కొద్ది రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని వివరించాయి. రెండో దశ ఉపసంహరణలోనూ ప్రధానంగా పాంగాంగ్‌ ప్రాంతంపైనే దృష్టిసారిస్తోంది భారత్​.

గతంలో ఇలా...

పశ్చిమ నుంచి తూర్పునకు చూసుకుంటే ఫింగర్​ 4 నుంచి 8 వరకు ఇక్కడే ఉంటాయి. ఉత్తరాన మంచు పర్వతాలు, దక్షిణాన పాంగాంగ్​ నది ఉంది. ఫింగర్​ 8 వద్ద వాస్తవాధీన రేఖ ఉండేదని భారత్​ చెప్తుంటే.. ఫింగర్​ 3 వరకు తమదేనని చైనా వాదిస్తోంది. గతంలోనూ పీఎల్​ఏ(చైనా ఆర్మీ) ఫింగర్​ 8 నుంచి 4 వరకు, భారత్​ ఫింగర్​ 4 నుంచి 8 వరకు పెట్రోలింగ్​ చేసేవి.

ఇరుదేశాలు...

గల్వాన్​ లోయ వద్ద పాయింట్​ 14 హాట్​ స్పింగ్స్​ వద్ద.. పాయింట్​ 15 గోగ్రా వద్ద.. పాయింట్​ 17 వద్ద ఇప్పటికే బలగాల ఉపసంహరణ జరిగింది. ఇరుదేశాల సైనికులు దాదాపు కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గలేదు. ఇరుదేశాలు ప్రాదేశిక వివాదాలకు ముగింపు పలకడానికి గంటల కొద్దీ చర్చల్లో పాల్గొంటున్నాయి. కార్ప్స్​ కమాండర్ స్థాయి, ప్రత్యేక ప్రతినిధిలు, దౌత్య పార్టీలూ ఈ విషయంపై తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాక ఇరుదేశాలు దాదాపు లక్షమంది సైనిక బలగాలను సరిహద్దుల్లో మోహరించాయి. అంతేకాకుండా యుద్ధ సామగ్రి, వాయిసేనలను తరలించాయి. అందుకే ఏప్రిల్​ మునుపటి పరిస్థితి రావాలంటే చాలా రోజులు చర్చలు జరగాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(రచయిత- సంజీవ్ కుమార్ బారువా)

Last Updated : Jul 17, 2020, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.