భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు భారత రైల్వే అధికారులు ప్రకటించారు. మార్చి 3నుంచి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి పునరుద్ధరణపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ రైలు బుధ, ఆదివారాల్లో భారత్ నుంచి పాక్కు వెళ్తుంది.
సేవలు నిలిపేసిన పాక్
ప్రతి సోమవారం, గురువారం పాకిస్థాన్లోని లాహోర్ నుంచి భారత్లోని దిల్లీకి వచ్చే సంఝౌతా రైలును ఇప్పటికే రద్దు చేసింది పాకిస్థాన్.
ఒప్పందం ప్రకారం
1971 సిమ్లా ఒప్పందం ప్రకారం 1976 జులై 22న భారత్-పాక్ మధ్య సంఝౌతా ఎక్స్ప్రెస్ ప్రారంభమయింది. దీనిలో ఆరు స్లీపర్, మూడు ఏసీ కోచ్లు ఉన్నాయి.