ETV Bharat / bharat

దేశంలో 2-3 దశల మధ్య కరోనా...

దేశంలో కరోనా వ్యాప్తి 2-3 దశల మధ్య ఉందని వెల్లడించారు దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా. ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని హెచ్చరించారు.

India between Stage 2 and 3 of COVID-19 pandemic
దేశంలో 2-3 దశల మధ్య కరోనా... 4,281 కేసులు
author img

By

Published : Apr 7, 2020, 6:01 AM IST

కొవిడ్‌-19 విస్తరణలో భారత్‌ ప్రస్తుతం 2-3 దశల మధ్య ఉందని దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. కొన్ని హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో స్థానిక సామాజిక వ్యాప్తి ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్లు కనిపిస్తోందని, అందువల్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని హెచ్చరించారు.

"ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గానే ఉంది. దేశంలో పరీక్షలు పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెద్దగా పెరగడంలేదు. కానీ కొన్నిచోట్ల హాట్‌ స్పాట్లు తయారుకావడం, అక్కడ కేసులు పెరగడం ఆందోళనకరం. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం స్థానికంగా ఉన్న వ్యాప్తిని విస్తృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలి. ఇంట్లో ఉండటం, సామాజిక దూరం పాటించడాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించినప్పుడే ఈ యుద్ధంలో గెలవగలం. మనం ఇప్పుడు రెండు, మూడు దశల మధ్యలో ఉన్నాం. చాలావరకు రెండో దశలోనే ఉన్నాం. చాలాచోట్ల సామాజిక వ్యాప్తి లేదు. హాట్‌ స్పాట్లలోనే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దాన్ని అరికట్టి, మరింత విస్తరించకుండా చూసుకుంటే మనం రెండో దశలోనే ఎక్కువగా ఉంటాం. ముంబయి నగరం, కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సామాజిక వ్యాప్తి ఉంది. దాన్ని ప్రమాద సంకేతంగా పరిగణిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలి. తబ్లీగి జమాత్‌ కార్యక్రమం వల్ల కేసులు పెరిగి ఉండొచ్చు. అందులో పాల్గొన్నవారు, వారితో సంబంధం ఉన్నవారిని కనిపెట్టి క్వారంటైన్‌కు పంపాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌తో పోరాటం చేస్తున్న వైద్యులకు ప్రజలంతా మద్దతుగా నిలవాలి"

-రణ్‌దీప్‌ గులేరియా, ఎయిమ్స్‌ డైరెక్టర్‌.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఏప్రిల్‌ 10 తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

కరోనా ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన వారికి లేదా వ్యాధిగ్రస్థులకు చేరువగా వెళ్లిన వారికే ఈ మహమ్మారి పరిమితమైతే దాన్ని రెండో దశగా పేర్కొంటారు. ఎక్కడి నుంచి వైరస్‌ సోకిందో కనిపెట్టలేకపోతే దాన్ని స్థానిక సామాజిక వ్యాప్తి లేదా మూడో దశగా పరిగణిస్తారు.

మేం చెబుతున్నదే ఆయన చెప్పారు

దేశంలో కొన్ని చోట్ల కరోనా స్థానికంగా సామాజిక వ్యాప్తి చెందుతోందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ చేసిన వ్యాఖలు తాము ఇంతవరకూ చెబుతున్న దానికి భిన్నంగా ఏమీ లేవని వైద్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

"నిర్దిష్ట ప్రాంతంలో పరిమిత సంఖ్యలో కేసులు వస్తే మేం 'క్లస్టర్‌ కంటెయిన్‌మెంట్‌' వ్యూహంతో వెళ్తాం. ఒకవేళ ఎక్కువ కేసులు వస్తే మరింత క్రియాశీలకంగా పనిచేస్తాం. ఒకవేళ సామాజిక వ్యాప్తి ఉంటే దేశం అప్రమత్తం కావాల్సి ఉంటుంది కాబట్టి మేమే మీడియా ముందుకొచ్చి చెబుతాం. ఇప్పుడు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ‘స్థానిక సామాజిక వ్యాప్తి’ (లోకలైజ్డ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) అన్న పదాలు వాడారు. దానర్థం కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయనే. మనం 2-3 దశల మధ్యలో ఉన్నట్లు ఆయన చెప్పారు. మూడో దశ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతపెద్ద దేశంలో కొన్ని చోట్ల ఎక్కువ కేసులు వస్తే దాన్ని నివారించడానికి మా దగ్గర నిర్దిష్టమైన వ్యూహాలున్నాయి. అందుకు అనుగుణంగా పనిచేస్తాం'

- లవ్‌ అగర్వాల్‌, వైద్యశాఖ సంయుక్త కార్యదర్శి .

లక్ష దాటిన కరోనా పరీక్షలు

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో దేశంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు లక్ష దాటాయి. సోమవారం రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ దేశంలో 1,01,068 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 4,281 మందికి పాజిటివ్‌ వచ్చింది. పరీక్షించిన వారిలో సగటున 4.23% మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ నెల 4 నాటికి ఇది 3.89% ఉండగా, 5వ తేదీకి 3.96%కి పెరిగింది. దేశంలో రోజుకు 13 వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉండగా సోమవారం 11,432 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ ఒక్క రోజులో చేసిన గరిష్ఠ పరీక్షల సంఖ్య ఇదే. ఈనెల 4న 11,182 చేశారు.

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.