జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని నిరోధించే ప్రయత్నాల్లో ఉన్న దాయాది పాకిస్థాన్‌కు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని, పాక్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రక్యాంపులను ధ్వంసం చేయాలని తేల్చిచెప్పింది.
జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్(యూఎన్హెచ్ఆర్సీ) 43వ సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ పాక్ ఆరోపించింది.
సలహా జాబితా...
పాక్ ఆరోపణలపై స్పందించిన భారత ప్రతినిధి, ప్రపంచ వేదికలపై భారత్‌ను కించపరిచే పాక్ చర్యలను అంతర్జాతీయ సమాజం విశ్వసించదన్నారు. ఈ మేరకు పాక్‌కు పది అంశాలతో కూడిన సలహాల జాబితాను అందజేసిన భారత దౌత్యవేత్త విమర్శ్ ఆర్యన్... ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయం అందించడం నిలిపివేసి, తమ భూభాగాలను నియంత్రణలో పెట్టుకోవాలని సూచించింది.
హింస మానుకోవాలి!
దైవదూషణ చట్టం పేరిట పాక్‌లోని మైనారిటీలను హింసించడం ఆపాలని హితవు పలికింది భారత్. ఎన్ఆర్సీ పై బెల్జియం అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్ఆర్సీపై ఎక్కడా చర్చ జరగలేదని ప్రధాని చెప్పినట్లు గుర్తుచేశారు విమర్శ్.
ఇదీ చూడండి: పెంపుడు కుక్కకు కరోనా వైరస్.. ఎక్కడంటే?